Begin typing your search above and press return to search.

న‌న్ను తిట్టేవాళ్ల‌కు ఇదే నా రిట‌ర్న్ గిఫ్ట్!

By:  Tupaki Desk   |   10 Jun 2019 5:39 AM GMT
న‌న్ను తిట్టేవాళ్ల‌కు ఇదే నా రిట‌ర్న్ గిఫ్ట్!
X
సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో నెటిజ‌నుల వీరంగం తెలిసిందే. సెల‌బ్రిటీల వ్యాప‌కం త‌మ‌కు న‌చ్చినా.. న‌చ్చ‌క‌పోయినా ట్రోలింగ్ తో వేడెక్కిస్తూ ప్ర‌చారంలోకి వ‌స్తున్నారు. ఇదో ట్రెండ్ సెట్టింగ్ వ్యాప‌కంగా మారింది. ఇప్ప‌టికే ప‌లువురు అందాల క‌థానాయిక‌లు బేబి బంప్ ప్ర‌ద‌ర్శ‌న పేరుతో నెటిజ‌నుల ట్రోల్స్ కి బ‌ల‌య్యారు. తాజాగా తెలుగు హీరోయిన్ స‌మీరారెడ్డికి ఈ బెడ‌ద త‌ప్ప‌లేదు. స‌మీరా ప్ర‌ద‌ర్శించిన బేబి బంప్ ఫోటోకి నెటిజ‌నులు ఓ ర‌కంగా చీవాట్లు వేశారు. దాంతో నెటిజ‌నుల‌కు ధీటైన స‌మాధానం ఎలా ఇవ్వాలి? అని ఆలోచించిన స‌మీరారెడ్డి మ‌రోసారి బేబి బంప్ ఫోటోని షేర్ చేసి ఘాటైన వ్యాఖ్య‌ల్ని గుప్పించారు.

``పుట్టేందుకు సిద్ధంగా ఉన్న నా బిడ్డ (హెర్) ఆత్మ ఎంతో బాధ‌ప‌డింది. నా క‌డుపులో స్విమ్ చేస్తున్న బిడ్డ ఆత్మ‌ను గాయ‌ప‌రిచారు. లావుగా ఉన్నాన‌ని.. ఎవ‌రైతే న‌న్ను తిట్టేందుకు ఉబ‌లాట ప‌డ్డారో వాళ్లంద‌రికీ ఇదే నా స‌మాధానం`` అని ఎమోష‌న్ తో కూడుకున్న కొటేష‌న్ ని స‌మీరారెడ్డి తాజా పోటోకి జోడించారు. బిజినెస్ మేన్ అక్ష‌య్ వార్ధేని స‌మీరా పెళ్లాడిన స‌మీరా రెడ్డి ప్ర‌స్తుతం రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తున్న సంగ‌తి తెలిసిందే.

బేబి బంప్ ప్ర‌ద‌ర్శ‌న‌పై నెటిజ‌నులు విరుచుకుప‌డ‌డం ఇదే తొలిసారి కాదు. ఫ్రెగ్నెంట్ బెల్లీ (స్ట‌మ‌క్)ని ప్ర‌ద‌ర్శించ‌డం అవ‌స‌ర‌మా? అంటూ నెటిజ‌నులు కామ‌న్ గానే సెల‌బ్రిటీల‌పై పంచ్ లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయినా తిట్టు - చీవాట్లు త‌ప్ప‌ద‌ని తెలిసీ టాప్ బ్యూటీస్ ఇలా బేబి బంప్ ప్ర‌ద‌ర్శ‌న‌కు వెన‌కాడ‌డం లేదు. స‌మీరారెడ్డి అస‌లే త‌గ్గ‌లేదు ఈ మ్యాట‌ర్ లో. స‌మీరా ఇదివ‌ర‌కూ సౌత్ లో మెగాస్టార్ చిరంజీవి- జూనియ‌ర్ ఎన్టీఆర్- సూర్య వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో న‌టించిన సంగ‌తి తెలిసిందే.