Begin typing your search above and press return to search.
డెలివరీ ముందు రోజు కూడా షూటింగేనట!
By: Tupaki Desk | 15 July 2019 12:41 PM GMTఆసక్తికర విషయాన్ని వెల్లడించారు నటి సమీరా రెడ్డి. ఇటీవల పండంటి పాపకు జన్మనిచ్చిన ఆమె రెండోసారి గర్భం దాల్చిన తర్వాత నుంచి తరచూ వార్తల్లోనే ఉంటున్నారు. తన బేబీ బంప్ ను చూపించుకోవటానికి మొహమాట పడకపోవటమే కాదు.. పలు ఫోటోల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కొందరు ట్రోలింగ్ ను ఎదుర్కొన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. శుక్రవారం సిజేరియన్ ద్వారా పండంటి పాపకు జన్మనిచ్చిన ఆమె.. డెలివరీ ముందు రోజు కూడా యాడ్ షూటింగ్ కు వెళ్లినట్లు చెప్పి ఆశ్చర్యపరిచారు.
సాధారణంగా నెలలు నిండిన తర్వాత ఎవరి పనులు వాళ్లు చేసుకోవటమే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది డెలివరీ ముందు రోజు కూడా పని చేయటం మామూలు విషయం కాదని చెప్పాలి. బుధవారం తాను టెస్టుల కోసం వెళితే.. సిజేరియన్ చేయాలని చెప్పారని.. దీంతో శుక్రవారం ఏకాదశి రోజు చేయించుకుంటానని చెప్పినట్లుగా వెల్లడించారు. తర్వాతి రోజు తాను యాడ్ షూటింగ్ కోసం వెళ్లినట్లు పేర్కొన్నారు.
ఏకాదశి రోజున తాను పాపకు జన్మనిచ్చినట్లు చెప్పిన సమీరా.. తెలిసిన వారి నుంచి చాలా కానుకలు వచ్చినట్లు చెప్పారు. ఇప్పట్లో పాప కోసం షాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకేఅనిపించినా ఇక్కడే సమీరా తప్పులో కాలేశారు. పాప ఎవరి పోలిక? అంటూ విలేకరి అడిగినప్రశ్నకు బదులిస్తూ.. పాప తనలా నల్లగా లేదని.. తెల్లగా ఉందని చెప్పారు.
పోలిక గురించి అడిగితే రంగు గురించి చెప్పాల్సిన అవసరం లేదని పలువురు తప్పు పడుతున్నారు. ఎవరి వరకూ వారిని చూస్తే.. తమకు లేని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు కదా. సమీరా కూడా అలానే ఆలోచించి ఉంటుందేమో? ఏమైనా.. పోలిక గురించి అడిగితే.. ఆ ముచ్చట చెబితే పోయే దానికి అనవసరంగా కాంట్రావర్సినీ వెతుక్కోవటం అవసరమా సమీరా?