Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: మోహంలో పడేసిన సమ్మోహనం
By: Tupaki Desk | 1 May 2018 12:27 PM GMTటాలీవుడ్ లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వారిలో ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ఉంటాడు. పాథ్ బ్రేకింగ్ మూవీస్ తీస్తాడని ఈయనకు పేరుంది. ప్రస్తుతం మంచి సక్సెస్ జోరులోనే ఉన్న ఈ దర్శకుడు.. ఇప్పుడు సమ్మోహనం అంటూ మళ్లీ కంటెంట్ బేస్డ్ మూవీతోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవితో టీజర్ రిలీజ్ పోస్టర్ తో పాటు నాలుగు మాటలు కూడా చెప్పించడంతో సమ్మోహనంపై అందరి దృష్టి పడింది. ఇవాళ ముందుగా చెప్పిన సమయానికే సమ్మోహనం టీజర్ ను విడుదల చేశారు. సినిమా ఇండస్ట్రీ అంటే అంతగా పడని ఓ హీరో.. సాహిత్యంతో పాటు సినిమా కూడా ఎప్పటికీ బతికే ఉంటుందని చెప్పే అతని తండ్రి.. దాన్ని ఒప్పుకోలేని హీరో పాత్రలో సుధీర్ బాబు కనిపిస్తారు. ఎప్పుడైతే హీరో పాత్ర ఈ అభిప్రాయాలతో ఉందో.. అప్పుడు ఆటోమేటిగ్గా అతనికి జోడీగా నటించిన భామ అదితి రావు హైదరి.. సినిమా హీరోయిన్ పాత్రలోనే ఉంటుందని ఊహించవచ్చు. ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది.. కాంప్రమైజ్ లాంటి అంశాలు.. కనిపించే గ్లామర్ వెనుక.. కనిపించని అసలైన మనసు కోసం వెతుక్కునే హీరో.. కథ కథనం ఇలా సాగిపోతుంది.
కానీ ఈ చిత్రానికి అసలు సిసలు స్పెషాలిటీ.. సమ్మోహనం అనే పేరు ఎందుకు పెట్టారు అనే ప్రశ్నకు సమాధానం.. అన్నీ చిత్రీకరణే అనే సంగతి టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ప్రతీ ఫ్రేమ్ ను ఎంత అందంగా చిత్రీకరించారంటే.. వర్ణించడానికి మాటలు చాలవేమో అనిపిస్తుంది. టీజర్ లోనే విజువల్స్ ఇంత మోహంలో పడేస్తే.. పూర్తి సినిమాలో సమ్మోహన పరచడం ఖాయం అనిపిస్తోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి