Begin typing your search above and press return to search.
చేనేత సింగారం.. మాటల మందారం
By: Tupaki Desk | 12 Jun 2017 9:58 AM GMTఅక్కినేని వారింటికి కాబోయే కోడలు సమంత అందం.. అభినయంతోనే కాదు.. తన వ్యక్తిత్వంతోనూ తెలుగు ప్రజలంందరి హృదయాలను కొల్లగొట్టింది. చేసే పనిని ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయాలని చెప్పడమే కాదు చేసి చూపిస్తుంటుంది. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ పేరిట పేద పిల్లల వైద్య సేవలకు తనవంతు సహాయం చేస్తూనే ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. దీనిని గౌరవంగా భావించకుండా బాధ్యతగా భావించి చేనేతకు పాపులారిటీ పెంచేందుకు సమంత చేస్తున్న ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
చేనేత దుస్తుల్లోనూ అందంగా కనిపించవచ్చని నిరూపించేందుకు సమంత వీలైనంతగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా సినిమా ఫంక్షన్లకు కొత్తకొత్త డిజైన్లతో చేనేత దుస్తులతో వెళ్తున్న సమంతపైనే అందరి దృష్టి ఫోకస్ అవుతోంది. తాజాగా చెన్నైలో జరిగిన అవార్డుల ఫంక్షన్ కు ఆమె డ్రస్సింగ్ చూస్తే చేనేత దుస్తులు ఎంత ఫ్యాషన బుల్ గా ఉంటాయో చెప్పకనే చెప్పినట్లయింది. చేనేత కళాకారులు అర్చన అండ్ పునీత్ డిజైన్ చేసిన చీరలో సమంత మెరిసిపోయింది. అభిమానులతో పాటు ఫ్యాషన్ క్రిటిక్స్ సైతం ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ ఫంక్షన్ లో సమంత స్టార్ అట్రాక్షన్ అయిపోయింది.
ఈ చీరకట్టుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో సమంత షేర్ చేసింది. చేనేత కళాకారులకు గౌరవం ఇవ్వాలంటూ ‘వెన్ హ్యాండ్లూమ్ షైన్స్.. రెస్పెక్ట్ యువర్ వీవర్’ అనే మాటలను ట్యాగ్ లైన్ చేసి అందరి హృదయాలను గెలుచుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/