Begin typing your search above and press return to search.
విమర్శలు ఎలా ఉన్నా.. ప్రేక్షకులు ప్రేమించారట
By: Tupaki Desk | 4 Aug 2017 8:27 AM GMTగతవారం గోపి చంద్ హీరోగా హన్సిక - క్యాథరీన్ హీరోయిన్లు గా వచ్చిన సినిమా 'గౌతమ్ నంద' పై మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమా పై కొంతమంది కొంచెం ఘాటుగానే విమర్శలు చేశారు. కానీ ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూస్తే మాత్రం సినిమా బాగా నే ఆడుతుంది అంటున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా గౌతమ్ నంద టీమ్ ఒక సక్సెస్ మీట్ పెట్టారు. ఈ ఈవెంట్ లో గౌతమ్ నంద డైరెక్టర్ సంపత్ నంది ప్రేక్షకుల ప్రేమకు ఫిదా అయ్యాను చెబుతూ ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు
''నిజం మాట్లాడుకుంటే గౌతమ్ నంద సినిమాకు మేము పబ్లిసిటీ అసలు చేయలేదు. సినిమా విడుదల అయినాక రివ్యూ లు చూస్తే చాలా దారుణంగా రాసారు. కానీ సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ మాత్రం నేను ఎప్పటికి మరిచిపోను. నా కెరియర్ లోనే నేను రాసిన మంచి కథ ఇది. నేను బాగా అభిమానించే ఇద్దరు వ్యక్తులు నుంచి నాకు వచ్చిన స్పందన మరింత ఆనందంగా ఉంది. కొంత మంది ప్రేక్షకులు సినిమా చూసి సినిమా కథ అద్భుతంగా ఉంది అని నాకు మెసేజ్ పంపారు. అలా వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒక రైటర్ గా డైరెక్టర్ గా చాలా ఆనందపడ్డాను. ఒక అమ్మాయి నాకు చెప్పింది ఈ సినిమా చూసిన తరువాత వాళ్ళ అమ్మకి ఒక బైక్ గిఫ్ట్ గా ఇచ్చిందట. ఇంతలా ఈ సినిమా ప్రేక్షకులు పై ప్రభావం చూపినందుకు చాల సంతోషంగా ఉంది'' అంటూ ఎమోషనల్ అయిపోయాడు సంపత్ నంది.
అలాగే సినిమా విడుదలైన తరువాత ఆ రోజు సాయంత్రం వరకు ఎవరు ఫోన్లు చేయలేదట. ఒక్కసారిగా కలెక్షన్లు పుంజుకోవడంతో తనతోటి డైరెక్టర్లు నుండి ఇండస్ట్రి ఫ్రెండ్స్ నుండి తన పనిని మెచ్చుకుంటు ఫోన్ కాల్స్ వచ్చాయట. మరి ముఖ్యంగా మా ఫ్రెండ్వా వాళ్ల నాన్నగారికి ఈ సినిమా బాగా నచ్చిందంటున్నాడు సంపత్. “నువ్వు ఇంతవరకు చేసిన అన్ని సినిమాలతో పోల్చి చూస్తే ఇదే నీ బెస్ట్ మూవీ'' అని చెప్పారట. ''నేను ఈ సినిమాలో కథను చెప్పే విదానం ఆయనకు బాగ నచ్చింది, డబ్బు ను ఎలా వాడాలి ఎందుకు వాడాలి ఎంతలో వాడాలి అనే కథనం ఆయనకు బాగ నచ్చింది అని చెప్పారు. విమర్శకులు ఎన్ని చెప్పిన నా సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లుకి నా దన్యవాదాలు తెలుపుకుంటున్నాను'' అని చెప్పి ముగించాడు.