Begin typing your search above and press return to search.
సీసీసీ కి మరో దర్శకుడి భారీ విరాళం..
By: Tupaki Desk | 3 April 2020 4:46 PM GMTకరోనా కారణంగా సినిమాల షూటింగ్స్ నిలిచిపోవడంతో సినిమా ఇండస్ట్రీలకు పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో ఇండస్ట్రీలో సినిమాల కోసం పనిచేసే దినసరి కూలీల జీవనం కష్టం అయిపోయింది. ఈ మధ్య కరోనా వైరస్ మూలంగా ప్రపంచం మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ నిలిచిపోతే సినీ కూలీలు పస్తులు ఉండాల్సిందే. ఈ దెబ్బతో సినిమా బాధితులంతా రోడ్డున పడ్డట్లయింది.
ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందించి భారీ విరాళాలు అందించడానికి కదిలి వస్తున్నారు. ఈ విరాళాల ద్వారా అయినా సినీ వర్కర్లకు కనీస సదుపాయాలు సమకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా క్రైసిస్ చారిటీకి దర్శకుడు సంపత్ నంది నేడు ముందుకొచ్చి 5లక్షలు విరాళం అందించాడట. తనవంతు ఉడతా భక్తిగా కొంత విరాళాన్ని అందిస్తున్నానని సంపత్ తెలిపాడు. ప్రస్తుతం మెగాస్టార్ సమక్షంలో చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం అని సంపత్ పేర్కొన్నాడు. సంపత్ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పెద్ద సినిమానే రూపొందిస్తున్నాడు. దాదాపు 70% షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.