Begin typing your search above and press return to search.

రొటీన్‌ గా తీసినా.. 10 కోట్లు పేమెంట్‌

By:  Tupaki Desk   |   17 Dec 2015 7:30 AM GMT
రొటీన్‌ గా తీసినా.. 10 కోట్లు పేమెంట్‌
X
సంప‌త్ నంది చేసింది కేవ‌లం మూడు సినిమాలే. అప్పుడే 10 కోట్ల క్ల‌బ్ ద‌ర్శ‌కుడు అయిపోయాడా? అంటే అవున‌నే అంటున్నారు ఫిలింన‌గ‌ర్‌ లో. అత‌డు రాధామోహ‌న్ నిర్మించిన ఏమైంది ఈవేళ చిత్రంతో ద‌ర్శ‌కుడ‌య్యాడు. మొద‌టి సినిమాతోనే యూత్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడిగా పాపుల‌ర్ అయ్యాడు. వ‌రుణ్‌ సందేశ్ తో తీసిన మొద‌టి సినిమా హిట్‌. ఆ త‌ర్వాత రామ్‌ చ‌ర‌ణ్ హీరోగా ర‌చ్చ లాంటి మ‌రో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ తెర‌కెక్కించాడు.

ఇప్పుడు లేటెస్టుగా ద‌ర్శ‌కుడిగా హ్యాట్రిక్ సాధించాడు అంటున్నారు. క్రిటిక్స ఒపీనియన్‌ ఎలా ఉన్నా కూడా మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బెంగాల్ టైగ‌ర్ చ‌క్క‌ని ఓపెనింగ్స్ సాధించి హిట్ సినిమాగా రికార్డుల కెక్కుతోంది. దీంతో సంప‌త్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింద‌ని చెబుతున్నారు. అత‌డు త‌దుప‌రి చిత్రానికి 10 కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే బోలెడంత మంది నిర్మాత‌లు సంప‌త్ క్యూలో ఉన్నారు. హిట్ డైరెక్ట‌ర్‌ గా మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడిగా అత‌డిపై క‌ర్చీఫ్‌ లు వేసేందుకు పోటీ పెరిగింద‌ని చెబుతున్నారు.

రొటీన్ సినిమా తీశాడు. చెత్త సినిమా తీశాడు అంటూ తిట్టి పారేసిన విమ‌ర్శ‌కులంద‌రికీ ఇదో ఛాలెంజ్‌. మ‌ధ్య‌లోనే త‌న‌ని తొల‌గించి పంపించేసిన ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ కి కూడా ఇదో స‌వాల్ లాంటిదే మ‌రి. ఏదేమైనా సంప‌త్ హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ ఇప్పుడు. 100 శాతం స‌క్సెస్ ఉన్న ద‌ర్శ‌కుడు. అంతుంది కాబ‌ట్టి 10 కోట్లు అందుకుంటే త‌ప్పేం కాదుగా!