Begin typing your search above and press return to search.

యూత్ కు ఎక్కేస్తున్న పేపర్

By:  Tupaki Desk   |   25 July 2018 8:17 AM
యూత్ కు ఎక్కేస్తున్న పేపర్
X
దర్శకుడిగా కెరీర్ ని ప్రేమ కథతో మొదలుపెట్టి ఆ తర్వాత మాస్ సినిమాల వైపు టర్న్ తీసుకున్న సంపత్ నంది నిర్మాతగా మాత్రం తనకిష్టమైన జానర్ లోనే వెళ్తున్నాడు. గత ఏడాది తన దర్శకత్వంలో వచ్చిన గోపీచంద్ గౌతమ్ నందా నిరాశ పరిచినప్పటికీ నిర్మాతగా మొదటి సక్సెస్ అందుకోవాలనే టార్గెట్ తో తీసిన పేపర్ బాయ్ మీద యూత్ లో హైప్ పెరుగుతోంది. సంపత్ కు నిర్మాతగా ఇది మొదటి సినిమా కాదు. ఆది సాయికుమార్ తో గాలిపటం తీసాడు కానీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందులో చేసిన పొరపాట్లు సరిచేసుకుని ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా పేపర్ బాయ్ తీసానని నమ్మకంగా చెబుతున్నాడు. జయశంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న పేపర్ బాయ్ లో సంతోష్ శోభన్ రియా సుమన్ జంటగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ తక్కువ టైంలోనే మిలియన్ వ్యూస్ దాటేయటం దీని మీద ఉన్న ఆసక్తిని చెప్పకనే చెబుతోంది.

సంపత్ నంది గురి దీన్ని బట్టి ఈసారి తప్పనట్టే కనిపిస్తోంది. ఎమోషనల్ లవ్ స్టోరీస్ కి మంచి ఆదరణ దక్కుతున్న నేపధ్యంలో దీని మీద మంచి బజ్ వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు హీరో క్యారెక్టర్ ని డబ్బు లేని పేదవాడిగా ఉపాధి కోసం పేపర్ బాయ్ గా మారినవాడిగా చూపడం యువతకు కనెక్ట్ అవుతోంది. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. భీమ్స్ మ్యూజిక్ కూడా చిన్న టీజర్ లోనే మంచి ఫీల్ ఇచ్చింది. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే పేపర్ బాయ్ మీద ట్రేడ్ కూడా ఆసక్తిగా ఉంది. లిమిటెడ్ బడ్జెట్ లో రూపొందిన ప్రేమ కథ కనక టాక్ బాగా వస్తే మంచి లాభాలు కూడా వస్తాయి. విడుదల తేదీ ఇంకా ఖరారు కాని పేపర్ బాయ్ నిర్మాత సంపత్ నంది దర్శకుడిగా తన నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది మాత్రం బయటపెట్టడం లేదు.