Begin typing your search above and press return to search.
గౌతమ్ నంద వెనక అసలు కథ
By: Tupaki Desk | 20 Jun 2017 4:13 AM GMTరామ్ చరణ్ తో రచ్చ.. రవితేజతో బెంగాల్ టైగర్ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంపత్ నంది.. తన తాజా చిత్రాన్ని గోపీచంద్ హీరోగా రూపొందిస్తున్నాడు. గౌతమ్ నంద అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ మూవీకి.. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. యూట్యూబ్ లో ఈ టీజర్ ఇప్పటికే 2 మిలియన్ల వ్యూస్ దాటి దూసుకుపోతోంది.
ఒక మల్టీ బిలియనీర్ గా కొడుకుగా గోపీచంద్ కనిపించనుండగా.. ఈ మూవీ కథకు కొన్ని వాస్తవ ఘటనలు స్ఫూర్తి అంటున్నాడు దర్శకుడు సంపత్ నంది. 'భగవాన్ రమణ మహర్షి రాసిన హూ యామ్ ఐ పుస్తకాన్ని చదివాను. ఈ కథకు బీజం అక్కడే పడింది. సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ లా మారలేడు. అలాగే బిలియనీర్ కొడుకు తన తండ్రిలా ఉండలేదు. నేను టాప్ బిలియనీర్లపై 2 నెలలకుపైగా రీసెర్చ్ చేశాను. వారి ప్రవర్తనతో పాటు.. ఆలోచనలు.. ఇష్టాలను కూడా పరిశీలించాను' అని చెప్పాడు దర్శకుడు సంపత్ నంది.
'ఓ ఏడాది క్రితం సూరత్ కు చెందిన ఓ డైమండ్ వ్యాపారి తన కొడుకుని కేరళ పంపి సామాన్యులు.. పేదల కష్టాలు తెలుసుకోవాలని పంపించిన వార్త చదివాను. ఆ సంఘటన నుంచి స్ఫూర్తిగా తీసుకుని.. ఆ పాయింట్ ను సినిమాలో ఉపయోగించుకుంటున్నాను. అయితే నా ఇతర సినిమా మాదిరిగానే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉంటాయి' అంటూ గౌతమ్ నంద కథ వెనక ఉన్న సీక్రెట్స్ చెప్పేశాడు సంపత్ నంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/