Begin typing your search above and press return to search.

'సీటీమార్'..అదే లైన్?

By:  Tupaki Desk   |   2 March 2020 8:30 PM GMT
సీటీమార్..అదే లైన్?
X
సంపత్ నంది డైరెక్షన్ లో 'సీటీమార్' సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే టాకీ పార్ట్ కి సంబంధించి సగం వరకూ పూర్తయిందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీపై రకరకాల డిస్కర్షన్ నడుస్తుంది. ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న సంపత్ నంది దీని కోసం ఓ రౌటిన్ కథనే రాసుకొని దానికి ఎంటర్ టైన్ మెంట్ - సెంటిమెంట్ యాడ్ చేసాడట.

సినిమా అంతా ఆడాళ్ళ మీదే ఉంటుందని ఓ పల్లెటూరి అమ్మాయి అయిన తమన్నా కబడ్డీ ప్లేయర్ అని ఆమెకు ఆట నేర్పించి చివరికి ఆమెచేత ఇండియాకి ఓ మెడల్ తీసుకొస్తాడని ఇలా ఏదో లైన్ అంటున్నారు. నిజానికి ఈ లైన్ మీద ఇప్పటికే అరడజను సినిమాలు దాకా వచ్చాయి. 'చెక్ దే ఇండియా' నుండి మొన్న వచ్చిన 'కౌసల్య కృష్ణమూర్తి' వరకూ ఇదే స్టోరీతో వచ్చాయి. మరి సంపత్ నంది ఇందులో ఏదైనా కొత్త పాయింట్ టచ్ చేసి ట్విస్ట్ ఇస్తాడా లేదా అదే రోటీన్ కథలో ఎంటర్టైన్ మెంట్ యాడ్ చేసి సింపుల్ గా తెల్చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ఏదేమైనా ఇప్పుడు సంపత్ నందితో పాటు గోపీచంద్ కి కూడా ఓ హిట్ కావాలి. ఇక తమన్నా హవా కూడా మెల్లగా తగ్గుతుంది. ఈ టైంలో ఈ బ్యూటీకి కూడా హిట్ సినిమా పడాలి లేదంటే అడపాదడపా రోల్స్ తో కాలం గెంటేయాల్సి వస్తుంది. మరి సీటీమార్ తో ఈ ముగ్గురి కోరిక తీరుతుందేమో చూడాలి.