Begin typing your search above and press return to search.

స్టార్ విలన్ డైవర్స్ కి కారణాలు అవేనా..?

By:  Tupaki Desk   |   5 May 2023 9:40 AM GMT
స్టార్ విలన్ డైవర్స్ కి కారణాలు అవేనా..?
X
మిర్చి విలన్ సంపత్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే. స్టైలిష్ విలన్ గా ఈమధ్య ఆయన బాగా కనిపిస్తున్నారు. సినిమాల్లో తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసె వారిలో సంపత్ రాజ్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా చేస్తూ మెప్పిస్తున్నారు. సంపత్ రాజ్ పర్సనల్ లైఫ్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. 24 ఏళ్ల కే పెళ్లి జరగడం వెంటనే ఒక పాప పుట్టడం అంతా అలా జరిగిపోయాయి.. పెళ్లి తర్వాత కొన్ని కారణాల వల్ల డైవర్స్ తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

తన భార్య తో తాను గొడవపడి ఏమి విడిపోలేదని.. ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుని డైవర్స్ తీసుకున్నామని అన్నారు. ఎర్లీ గా పెళ్లి చేసుకోవడం వల్ల అలా జరిగి ఉండొచ్చని అన్నారు. తన పాప 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తాను డైవర్స్ తీసుకున్నానని.. ఇప్పుడు పాప యూఎస్ లో జాబ్ చేస్తుందని.

పాపకి కావాల్సినవన్నీ తానే చూస్తానని అన్నారు సంపత్ రాజ్. విడిపోయినా కూడా తన మాజీ భార్య తనతో మాట్లాడుతుందని అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటామని అన్నారు.

ఈ స్టైలిష్ విలన్ తను చేస్తున్న పాత్రల్లోనే కాదు లైఫ్ మీద కూడా ఒక క్లారిటీ ఉన్నట్టు ఉన్నాడు. ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల అప్పుడే ఫ్యామిలీ లైఫ్ వద్దనుకున్నారో ఏమో కానీ పాప పుట్టగానే విడాకులు తీసుకున్నారు. అదికూడా ఎలాంటి గొడవలు కొట్లాటలు లేకుండానే అని అన్నారు.

ఇక తన మదర్ కి నేను ఆర్టిస్ట్ అవ్వడం ఇష్టం లేదు తన తండ్రి సపోర్ట్ తోనే ఇంటి నుంచి పారిపోయి మరీ సినిమా ప్రయత్నాలు చేశానని అన్నారు.

అయితే తాను సక్సెస్ అందుకున్న టైం లో నాన్న లేకపోవడం ఎప్పటికీ బాధపెడుతుందని అన్నారు. తన మదర్ తనతోనే ఉంటారని.. ఆమెను చాలా బాగా చూసుకుంటానని అన్నారు సంపత్ రాజ్. అంతేకాదు పాప యూఎస్ నుంచి ఇక్కడకు వస్తే తనతోనే టైం స్పెండ్ చేస్తానని ఆ టైం లో షూటింగ్ ఉన్నా క్యాన్సిల్ చేస్తానని చెప్పుకొచ్చారు సంపత్ రాజ్.