Begin typing your search above and press return to search.
నాకు 23లోనే పెళ్లి.. ఆ వెనకే విడాకులు: స్టార్ యాక్టర్
By: Tupaki Desk | 26 May 2020 2:30 AM GMTతెలుగు ఇండస్ట్రీ లో ప్రభాస్ నటించిన మిర్చి మూవీ నుండి విలనిజమ్ కాస్త పంథా మారింది. స్టైలిష్ విలన్స్ ఉన్నారు.. అలాగే హీరోల లాంటి విలన్స్ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి స్టయిలిష్ అండ్ హీరోయిక్ పర్సనాలిటీ ఉన్న నటుడు సంపత్ రాజ్. మిర్చి సినిమాతో మొదలైన ఆయన టాలీవుడ్ జర్నీ.. అలా టాలీవుడ్ లోని అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేయించింది. ఓ విలన్ నుండి ఎమోషనల్ క్యారెక్టర్ల వరకు అన్నింటిలో సంపత్ మెప్పించారు. సంపత్ రాజ్ అంటే అందరికీ ముందుగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి సినిమానే గుర్తొస్తుంది. ఆ సినిమాలో "నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేస్తా. నేను చెప్పిన మగతనం ట్రై చేస్తావా" "రారా మగాడా.." అంటూ ఆయన డైలాగులు ఓ మార్క్ సృష్టించాయి. అయితే సినిమా లైఫ్ పరంగా సంతోషంగా ఉన్న సంపత్.. వివాహ జీవితంలో మాత్రం విడాకులు తీసుకోవాల్సి వచ్చిందట.
ఈ విషయం గురించి ఆయనే స్వయంగా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని తన వైఫ్.. విడాకులు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. సంపత్ మాట్లాడుతూ.. "నాకు 23యేళ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాను. ఆ టైంలో నా భార్యకి 19యేళ్లు. పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలానికి ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం.. తరచూ వాదించుకోవడం జరుగుతుండేవి. ఇక చివరికి మా ఇద్దరి లక్ష్యాలు వేరని అర్ధం చేసుకొని విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాము. అప్పటి నుండి వేరువేరుగా ఉంటున్నాం. కానీ మాకు ఓ కూతురు కూడా ఉంది. నా కూతురు నా దగ్గరే ఉంటుంది. ఇక మేం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. నా కూతురు అప్పుడప్పుడు వాళ్ల అమ్మను చూడటానికి వెళ్తుంది. నేను కూడా ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాను. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు విబేధాలు లేవు" అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. సంపత్ ప్రస్తుతం తెలుగు, తమిళ కన్నడ బాషలలో కొన్ని సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు.