Begin typing your search above and press return to search.
సంపూ `ఆండ్రాయిడ్` లుక్ అదుర్స్
By: Tupaki Desk | 4 March 2016 9:22 AM GMTహీరో ఎలా ఉండాలి? అనేందుకు అందరూ చెప్పే సమాధానాలు కొన్ని ఉంటాయి! ముందుగా మంచి లుక్ ఉండాలి! కనీసం 6 అడుగుల రూపం ఉండాలి! ఆకట్టుకునే పర్సనాలిటీ ఉండాలి! సిక్స్‌ప్యాక్ ఉండాలి! మ్యాన్లీగా ఉండాలి! ముఖ్యంగా డ్యాన్స్ - ఫైట్స్ లో దుమ్మురేపాలి! కానీ ఆ హీరోకి ఈ లక్షణాల్లో ఒక్కటంటే.. ఒక్కటి కూడా లేదు! అస్సలు భూతద్దమేసి వెతికినా.. మచ్చుకైనా కనిపిస్తే ఒట్టు! కానీ ఒకే ఒక్క సినిమాలో ఓవర్ నైట్ `స్టార్` అయిపోయాడు! పంచ్ డైలాగులతో, అద్భుతమైన డ్యాన్స్ లతో ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించాడు! అందరి హృదయాలను తన నటనతో `బర్నింగ్` చేసేశాడు! పేరడీకి సరికొత్త నిర్వచనంలా మారాడు! అందుకే బర్నింగ్ స్టార్ అయిపోయాడు మన సంపూర్ణేశ్ బాబు!
`హృదయ కాలేయం`తో అందరి హృదయాలను తన నటనతో కాల్చేసిన నటుడు సంపూ! ఇప్పుడు ఆయన కనిపిస్తే అందరి ముఖాలపై చిరునవ్వు రాకమానదు! హృదయ కాలేయంతో సెటైరికల్ కామెడీతో అలరించాడు! జనాలకు గిలిగింతలు పెట్టాడు. అందుకే కాసులు కురిపించారు. తరువాత వచ్చిన సింగం 123తో మరోసారి స్క్రీన్ పై ఆడియన్స్ కు చక్కెలిగింతలు పెట్టాడు. ఇప్పుడు `కొబ్బరి మట్ట` అనే సినిమాతో రాబోతున్నాడు. ఇందులో ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు గెటప్పుల్లో కనిపించనున్నాడు. ఇందులో ఒక కేరెక్టర్ పేరు `ఆండ్రాయిడ్`. ఈ కేరెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ఇటీవలే విడుదల చేశారు. ఇందులో సంపూ ముఖాన్ని చూపించకపోయినా.. ఒక సూపర్ బైక్ పై స్టైల్ గా దిగుతూ ఉన్న పోస్టర్ ఇప్పుడు అలరిస్తోంది! ఇప్పటికే ఇందులోని పెదరాయుడు కేరెక్టర్ పోస్టర్ ని విడుదలచేసిన సంగతి తెలిసిందే.