Begin typing your search above and press return to search.

పవన్ శివాజీ సరసన మరో హీరో

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:08 AM GMT
పవన్ శివాజీ సరసన మరో హీరో
X
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించాలంటూ రాష్ట్ర విభజన సమయం నుండీ తమ వాదన వినిపిస్తున్న వారిలో హీరో శివాజీ ఒకడు. అయితే ప్రస్తుతం లైం లైట్ లో లేడు కాబట్టి అతని వాదనలో బలమున్నా దానికి కావలిసినంత ప్రచారం కలుగలేదు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రసంగం ద్వారా తన ఉద్యమ భావనని తెలుపడంతో ఈ అంశం వేడెక్కింది.

పవన్ ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని త్వరలో కాకినాడ నుండి శ్రీకారం చుట్టనున్నారు. శివాజీ పవన్ కి మద్దతు తెలుపడం కూడా జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ అంశంపై తాను కూడా పోరాడతానంటూ మరో హీరో ముందుకు కదిలాడు. అతనే సంపూర్ణేష్ బాబు. స్వతహాగా తెలంగాణాలో పుట్టి పెరిగిన సంపూ పరాయి రాష్ట్రానికి మంచి జరగడం కోసం పోరాటానికి సిద్ధంకావడం విశేషం.

పవన్ స్పీచ్ తరువాతే ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో తెలిసిందని, తన శక్తికి తగ్గట్టు పోరాడతానని తెలిపాడు. ప్రత్యేక రాష్ట్ర సమయంలో స్పందించిన సినీ పరిశ్రమ ఇప్పుడు కూడా స్పందించాలని భావించాడు. ఎందుకంటే మనం ఈ పొజిషన్ లో వుండడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షకులు కూడా కారణమని గుర్తుచేశాడు..