Begin typing your search above and press return to search.

‘బెల్ట్’ పెట్టుకోని కామెడీ హీరోకి ఫైన్ వేశారు

By:  Tupaki Desk   |   24 Jan 2016 5:48 AM GMT
‘బెల్ట్’ పెట్టుకోని కామెడీ హీరోకి ఫైన్ వేశారు
X
ఏదైనా తప్పుడు పని చేసి పోలీసులకు దొరికిపోతే ఎలా ఉంటుంది? అవమాన భారం.. అనవసరంగా తప్పు చేసి దొరికిపోయామే అన్న భావన కలగటం ఖాయం. చిన్న చిన్న తప్పులే అయినా.. పోలీసుల చేతికి చిక్కటం ఇబ్బందిగా ఫీల్ కావటం కామన్. కానీ.. టాలీవుడ్ కామెడీ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేశ్ బాబు తాజాగా పోలీసుల చేతికి చిక్కారు.

మెదక్ జిల్లా సిద్దిపేటలోని విక్టరీ చౌరస్తాలో సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారును నడుపుతున్న విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు అతనికి రూ.100 ఫైన్ వేశారు. ఇలాంటివి సంఘటనలు ఎదురైనప్పుడు కాస్త సీరియస్ అయ్యే సెలబ్రిటీలకు భిన్నంగా సంపూర్ణేశ్ బాబు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వటం గమనార్హం. తప్పును లైట్ తీసుకున్నాడనుకోవాలా? లేక.. తప్పును హుందాగా ఒప్పుకొని ఫైన్ కట్టేశారనుకోవాలా?