Begin typing your search above and press return to search.

సరైనోడికి సంపూ స్పూఫ్ వేశాడు?

By:  Tupaki Desk   |   4 March 2016 5:30 PM GMT
సరైనోడికి సంపూ స్పూఫ్ వేశాడు?
X
బర్నింగ్ స్టార్ అంటూ సంపూర్ణేష్ బాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ.. సంపూ చేసిన హృదయకాలేయం ఆన్ లైన్ లో బాగానే హంగామా చేసింది. థియేటర్లు కూడా బాగానే నిండడంతో.. ఈ ప్రాజెక్టు బాగానే వర్కవుట్ అయింది. ఈ సెటైరికల్ స్పూఫ్ కామెడీని జనాలు అదరించడంతో.. హృదయకాలేయం దర్శకుడు సాయి రాజేష్.. సంపూతోనే మరో సినిమా మొదలుపెట్టాడు.

కొబ్బరిమట్ట టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని కూడా స్పూఫ్ లను బేస్ చేసుకునే తీస్తున్నారు. ఈ మూవీలో చాలా రకాల గెటప్ లలో సంపూర్ణేష్ కనిపించనున్నాడు. మొదట మోహన్ బాబు మూవీ పెదరాయుడుకి పేరడీ గెటప్ వేసిన సంపూ.. ఆ తర్వాత బాహుబలిని కూడా ఇమిటేట్ చేసేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ని టార్గెట్ చేశాడు దర్శకుడు. బన్నీ నటించిన సరైనోడు చిత్రానికి ఫస్ట్ లుక్ కంటే ముందే.. ఆ పోస్టర్ లో కొంత భాగాన్ని రివీల్ చేస్తూ.. ఓ స్పెషల్ పోస్టర్ వేశారు. ఇప్పుడు అలాంటి పోస్టర్ నే సంపూర్ణేష్ కూడా ట్రై చేశాడు.

ఓ కాస్ట్లీ బైక్ పై కూర్చున్న వ్యక్తిని సగమే చూపించినా.. సంపూ యాజ్ ఆండ్రాయిడు అంటూ అసలు విషయం చెప్పేశారు. అంటే సరైనోడుని ఆండ్రాయిడుగా మార్చేశారన్న మాట. అప్పుడెప్పుడో పెదరాయుడు నుంచి మొదలుపెట్టి.. బాహుబలి - లేటెస్ట్ సరైనోడుని కూడా వదలడం లేదంటే.. ఈ సారి కూడా సంపూ హంగామా ఎక్కువగానే ఉండొచ్చన్న మాట.