Begin typing your search above and press return to search.
సంపూ.. ఉపేంద్ర వేషం వేసుకుంటే..
By: Tupaki Desk | 24 April 2017 11:13 AM GMTబర్నింగ్ స్టార్ సంపూర్ణేణ్ బాబును మొదట్లో చూసి ఇతను హీరో ఏంటి అన్నారు. బర్నింగ్ స్టార్ అంటూ ఆ బిరుదేంటి అని కూడా ఎద్దేవా చేశారు. కానీ ‘హృదయ కాలేయం’ సినిమాలో ఇలాంటి బిల్డప్పులతోనే ఆకట్టుకున్నాడు సంపూ. ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయింది. సంపూర్ణేష్ బాబుకు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టింది. ఇప్పుడు ‘కొబ్బరి మట్ట’ అనే మరో సెటైరికల్ కామెడీతో రాబోతున్నాడు సంపూ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన నేపథ్యం గురించి సంపూ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాను ఎన్నారై అని.. తనకు చాలా డబ్బులన్నాయని చెప్పిన మాటలన్నీ అబద్ధమని.. సిరిసిల్లలోని సామాన్య కుటుంబానికి చెందిన వాడినని సంపూ వెల్లడించాడు ఓ ఇంటర్వ్యూలో.
ఈ ఇంటర్వ్యూలో దీంతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు సంపూ. సినిమాల్లోకి రాకముందు తనకు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అంటే చాలా అభిమానం ఉండేదని.. ‘ఉపేంద్ర’ సినిమా వచ్చినపుడు తాను వెర్రెత్తిపోయానని సంపూ చెప్పాడు. ఆ సినిమా తమ ఊర్లో వారం రోజులే ఆడినప్పటికీ తాను పది సార్లు చూశానని.. ఆ సినిమా ప్రభావంతో ఉపేంద్ర లాగే జుట్టు పెంచుకుని.. పిలక వేసుకుని.. విచిత్రమైన డ్రెస్సింగ్ తో వీధుల్లోకి వచ్చేవాడినని జనాలు తనను చూసి జడుసుకునేవాళ్లని.. పోలీసులు తనను అదుపులోకి తీసుకునే వరకు పరిస్థితి వచ్చిందని సంపూ చెప్పాడు. ఇక తాను హీరో కాకముందు కంటే కూడా హీరో అయ్యాకే ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్నట్లు సంపూ చెప్పాడు. అర్ధరాత్రి వేళల్లో ఫోన్ కాల్స్ వచ్చేవని.. నువ్వు హీరో ఏంట్రా అంటూ బూతులు తిట్టేవాళ్లని.. ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేవాడినని సంపూ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/