Begin typing your search above and press return to search.
కొబ్బరిమట్ట సేల్స్.. నిజమేంటి బాస్?
By: Tupaki Desk | 28 Jun 2016 3:30 PM GMTబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు లేటెస్ట్ మూవీ కొబ్బరి మట్ట. హృదయకాలేయం మూవీకి ఆన్ లైన్ హంగామాతోనే సక్సెస్ సాధించేసి.. వెబ్ మీడియా, సోషల్ మీడియా పవర్ ఏంటో చాటి చెప్పాడు. ఇప్పుడు కొబ్బరి మట్ట అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సంపూ.
పెదరాయుడు - పాపారాయుడు - ఆండ్రాయిడు అంటూ కొబ్బరి మట్టలో మూడు పాత్రలు పోషిస్తున్న సంపూర్ణేష్.. రీసెంట్ గా లింగ వివక్షపై చాంతాడంత డైలాగ్ తో టీజర్ ని విడుదల చేశాడు. అయితే.. కొబ్బరిమట్ట చిత్రానికి ఓవర్సీస్ రైట్స్ రూ.30 లక్షలు పలికాయంటూ ఓ ప్రెస్ నోట్ ఇచ్చారు. సంపూర్ణేష్ బాబు సినిమాకి ఇంత అమౌంట్ చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే.. ఇదంతా పబ్లిసిటీ హంగామా అంటూ ఇప్పుడు కొందరు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సంపూర్ణేష్ బాబు నటించిన హృదయకాలేయం ఓవర్సీస్ లో వసూలు చేసిన మొత్తం కేవలం 3 వేల డాలర్లు. అంటే మన లెక్కల్లో 2 లక్షల రూపాయల్లోపే. అలాంటప్పుడు కొబ్బరిమట్టకు ఏ యాంగిల్ లో 30 లక్షలు ఇచ్చి కొనుక్కున్నారంటారు?
ఇంత అమౌంట్ కి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. కొబ్బరిమట్ట కనీసంలో కనీసం 50 ధియేటర్లలో రిలీజై.. 1,30,000 డాలర్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇది అసాధ్యమైన విషయంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు తేల్చేస్తున్నారు. అలాంటప్పుడు 30 లక్షలు ఇచ్చి ఎలా కొనుంటారు అనే విషయం మాత్రం అర్ధంకావట్లేదు.