Begin typing your search above and press return to search.

మహేష్‌ తో పాటు కొబ్బరిమట్ట కూడా..

By:  Tupaki Desk   |   11 April 2017 7:42 AM GMT
మహేష్‌ తో పాటు కొబ్బరిమట్ట కూడా..
X
బుధవారం ఏప్రిల్ 12.. సాయంత్రం 5 పీఎం.. ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులు ఇలాగే పాట పాడేసుకుంటూ ఎదురు చూసేస్తున్నారు. ఇందుకు కారణం.. వారు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న మహేష్ కొత్త మూవీ ఫస్ట్ లుక్ ఆ టైంకి రానుండడమే. కనీసం పేరు కూడా చెప్పకుండా ఇంత కాలం ఊరించిన తర్వాత.. ఇప్పుడు ఫస్ట్ లుక్ ఇస్తామని చెప్పడంతో.. ఆ టైం కోసం ఆత్రంగా చూస్తున్నారు.

ఆ సమయానికి ట్విట్టర్ షేక్ అయిపోవడం లాంటివి ఖాయంగా అనుకోవచ్చు. అయితే.. టాలీవుడ్ జనాలు అందరూ యాక్టివ్ అయ్యే అదే టైంను ఉపయోగించుకునేందుకు రెడీ అయిపోయాడు సంపూర్ణేష్ బాబు. చాలా కాలంగా కొబ్బరిమట్ట అనే సినిమాను చేస్తూనే ఉన్నాడు ఈ కామెడీ హీరో. గతేడాది మే నెలలో టీజర్ ఇచ్చిన ఈ సినిమాకి.. మధ్యమధ్యలో పోస్టర్లు తప్ప ఇంకేం రావడం లేదు. అంతో ఇంతో క్రియేట్ అయిన హైప్ కూడా ఇప్పుడు దాదాపుగా ఆవిరి అయిపోయింది.

అందుకే మరోసారి కొబ్బరి మట్టను వార్తల్లో నిలిపేందుకు మహేష్ మూవీ ఫస్ట్ లుక్ ఇచ్చే టైమ్ కే.. సాంగ్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ వేశారు. చేతిలో త్రిశూలం పట్టుకుని ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం పంచెతో వింత వింత డ్యాన్సులు వేస్తున్న సంపూ పోస్టర్ భలే కామెడీగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/