Begin typing your search above and press return to search.

ఓవర్ రేటింగ్ ఇచ్చేశారయ్యా!!

By:  Tupaki Desk   |   27 July 2017 7:18 AM GMT
ఓవర్ రేటింగ్ ఇచ్చేశారయ్యా!!
X
మామూలుగా ఒక రకమైన ఫోజు పెట్టి ఫోటో దిగగానే.. అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. ఇక రాజమౌళి వంటి దిగ్గజం ఆ సినిమా గురించి ట్వీట్ చేయడంతో మామూలుగా రావల్సిన బజ్ కంటే ఎక్కువగానే వచ్చేసింది. దానితో మనోడు ఒక్కసారిగా బర్నింగ్ స్టార్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ విధంగా నరసింహాచారి.. ఒక సంపూర్ణేష్‌ బాబు అవతారం ఎత్తేశాడు. కాని అక్కడే అసలు సిసలైన టెస్ట్ ప్రారంభమైంది.

అప్పటినుండి సంపూర్ణేష్‌ బాబు చేసిన సినిమాలైనా.. అలాగే అతడు నిన్నగాక మొన్న దిగిన బిగ్ బాస్ ఇల్లయినా కూడా.. అతడికి హిట్ మాత్రం ఇవ్వలేదు. ఓవర్ నైట్ వచ్చిన క్రేజ్ ను ఒక సక్సెస్ గా మలుచుకోవడంలో అతను ఘోరంగా విఫలమయ్యాడు. దీనంతటికీ కారణం సంపూర్ణేష్‌ కు ఓవర్ రేటింగ్ ఇచ్చేయడమే. మనోడు జస్ట్ ఇలా కనిపిస్తే అలా నవ్వులు పూయడానికి ఈయనేమో బ్రహ్మానందం రేంజ్ యాక్టర్ కాదు. అలాగే సునీల్ తరహాలో పంచులను సింపుల్ గా సంచిలో వేసుకెళ్ళే రకమూ కాదు. కాని అతనిది ఆ రేంజ్ అంటూ రేటింగులు ఇచ్చేయడంలో.. అసలు తను ఏం చేస్తే బెటర్ అనేది సంపూ తెలుసుకోలేకపోయాడు.

ఇక బిగ్ బాస్ లో కూడా.. తాను ఇప్పటివరకు ఒక బర్నింగ్ స్టార్ అనిపించుకున్న సంపూ.. రియల్ టైమ్ లో రియల్ గా ఉండాల్సి వచ్చేసరికి.. సెన్సేషనలిజం కట్టిపెట్టి నిజంలో ఉండాల్సి వచ్చేసరికి.. ఖచ్చితంగా షాకుకు గురయ్యాడంతే. ఒకే చోట ఎక్కువరోజులు ఉండలేను అంటూ చెప్పాడు కాని.. అది క్లాస్ట్రోఫోబియా అనేకంటే కూడా.. ఇన్నాళ్ళు తన చుట్టూ కట్టుకుపోయిన ఈ సెన్సేషనల్ అద్దాల భవనం తాలూకు రియాల్టీ అనే అనుకోవాలి. అందుకే తనకు ఆర్డర్లు ఇస్తున్న బిగ్ బాస్ పై విరుచుకుపడ్డాడు. నన్ను ఆడుకుంటున్నారు అంటూ రెచ్చిపోయాడు. చివరకు సూసైడ్ చేసుకుంటా అంటూ భయపెట్టాడు.. అంటున్నారు విశ్లేషకులు.

మరి బయటకొచ్చాక సంపూర్ణేష్‌ ఏం చేస్తాడో చూడాలి. అసలే బిగ్ బాస్ వారు ఫైన్ వేస్తారని అంటున్నారు.. దాని గురించి ఎలా రియక్ట్ అవుతాడో అది కూడా చూడాల్సిందే.