Begin typing your search above and press return to search.
సంపూ మారుతి 800లో తిరగడమేటి?
By: Tupaki Desk | 25 Jan 2016 7:30 PM GMTబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడట. వాళ్ల దగ్గర ఫైన్ కూడా కట్టించుకున్నాడట. ఈ మధ్య ఓ ప్రముఖ పత్రికలో సంపూర్ణేష్ బాబుకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసినట్లు ఓ వార్త ప్రచురితమైందిలెండి. సంపూ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడుపుతుండటంతో పోలీసులు ఆపి.. జరిమానా విధించారని, అతడితో పాటు ఓ వందమందికి పైగా ఫైన్ వేశారని ఆ వార్తలో రాశారు. సంపూ కారును ఆపి.. పోలీసులు చలానా ఇస్తున్న ఫొటో కూడా పత్రికలో ప్రచురితమైంది. ఈ వార్తను తనే స్వయంగా షేర్ చేసి.. తనలా ఎవ్వరూ పొరబాటు చెయ్యకండి.. క్షేమంగా డ్రైవ్ చేయండి.. అంటూ పిలుపునిచ్చాడు సంపూ.
ఐతే తాను సీట్ బెల్టు పెట్టుకోకపోవడానికి కారణం చెబుతూ.. అసలు మారుతి 800 కారుకు సీట్ బెల్టే ఉండదు కదా అని ప్రశ్నించాడు సంపూ. ఈ ఫైన్ సంగతి సరే కానీ.. మన బర్నింగ్ స్టార్ మరీ మారుతి 800లో తిరుగుతుండటమేంటో అర్థం కావడం లేదు. ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు చేశాడు. చాలా కామెడీ రోల్స్ కూడా చేశాడు. ఇంకా హీరోగా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంటూ.. మరోవైపు కామెడీ క్యారెక్టర్లు కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న సంపూ.. ఔట్ డేటెడ్ అయిపోయిన మారుతి 800 కార్లో తిరుగుతుండటమే కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. తన రేంజికి కనీసం ‘హ్యుందాయ్ ఐ 10’ అయినా కొనుక్కోలేకపోయాడేమిటో?