Begin typing your search above and press return to search.
వర్మకి సంపూ కౌంటర్ వేశాడా?
By: Tupaki Desk | 12 Feb 2016 8:19 AM GMTరామ్ గోపాల్ వర్మ వివాదాలతోనూ, విభిన్నమైన ప్రకటనలతో ఏదో ఓ రకంగా వార్తల్లో ఉంటాడు. ఇప్పుడు బెజవాడ రౌడీయిజం అంటూ వంగవీటి సినిమాను తీస్తున్న వర్మ.. దాని పబ్లిసిటీ కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. రీసెంట్ గా ఇది తెలుగులో నా చివరి సినిమా అని కూడా చెప్పేశాడు. వంగవీటికి మించిన స్టోరీ దొరకదు కాబట్టి.. ఇదే నా చివరి తెలుగు సినిమా అన్నది వర్మ వాదన.
అయితే.. వర్మ చెప్పిన ఈ లాస్ట్ ఫిలిం అన్న మాటకు టాలీవుడ్ లో కొందరు నవ్వుకున్నారు, మరికొందరు పట్టించుకోవడం మానేశారు. కానీ ఎవరూ రిటార్ట్ ఇవ్వలేదు. ఆశ్చర్యకరంగా బర్నింగ్ స్టార్ సంపూ మాత్రం వర్మకి వ్యతిరేకంగా ట్వీటాడు. అప్పట్లో నాగార్జునతో గోవిందా గోవింద సినిమా తీసినపుడు కూడా వర్మ ఇలాగే శపథాలు చేశాడని గుర్తు చేశాడు. నిజానికి గోవిందా గోవింద సినిమాకి సెన్సార్ విధించిన కట్స్, రిలీజ్ ని అడ్డుకోవడం.. వర్మకి బాగా చిరాకు తెప్పించాయి. అందుకే చాలా రోజులు తెలుగు సినిమాలు తీయలేదు. తర్వాత మళ్లీ అనగనగా ఒక రోజు మళ్లీ టాలీవుడ్ లో సినిమాలు మొదలుపెట్టాడు.
అది సరే కానీ.. అసలు ఎవరిపైనా కామెంట్ చేయని సంపూర్ణేష్ బాబు ఏకంగా వర్మకు కౌంటర్ వేసేశాడా అన్నది అసలు ప్రశ్న. గతంలో కూడా ఇలాగే రాజ్ తరుణ్ అకౌంట్ లోంచి ఆ హీరో తనను తిట్టినట్లుగా ట్వీట్స్ పెట్టి వార్తల్లోకెక్కిన వర్మ.. ఈసారి కూడా సంపూ అకౌంట్ లోంచి తనకి తనే కౌంటర్ వేసుకున్నాడని అంటున్నారు. వేరే వాళ్లెవరో అనేందుకు బదులు.. ముందు మనమే అనేసుకుంటే సరిపోతుంది కదా.