Begin typing your search above and press return to search.
సంపూను అంత దారుణంగా తిట్టారా?
By: Tupaki Desk | 23 Jun 2016 11:29 AM GMTనీయమ్మా.. నీ ఆలి.. లం.కొ.. ఇలాంటి తిట్లు తిట్టారట మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును. ఈ సంగతి ట్విట్టర్లో స్వయంగా సంపూనే వెల్లడించాడు. ‘‘ఈ రోజు గొప్ప దినం. చాలా కాలం తర్వాత ‘అమ్మ.. ఆలి.. లం.కొ’ లాంటి తిట్లు తిన్నాను. ఆటా ఆర్గనైజర్ శ్రీ రాజ్ చెన్నుపాటి నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది’’ అని ఈ ఉదయం ట్వీట్ చేశాడు సంపూర్ణేష్ బాబు. అంతే కాక.. ‘‘మేం బిచ్చగాళ్లం కాదు.. వ్యభిచారులం కాదు.. మాకు జరిగిన ఈ అనుభవంతో ఆటా కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాం’’ అని కూడా మరో ట్వీట్ చేశాడు సంపూ. ఐతే అంతలో ఏం జరిగిందో ఏమో కొంతసేపటి తర్వాత ఆ ట్వీట్లను డెలీట్ చేసేశాడు సంపూ.
బహుశా సంపూ ట్వీట్లతో తమ సంస్థ పరువు పోతుందని అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతినిధులు సంపూతో మాట్లాడి.. రాజీకి వచ్చినట్లున్నారు. అమెరికాలోని ఎన్నారై సంఘాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల్ని తమ కార్యక్రమాలకు ఆహ్వానించడం.. వారికి అతిథి సత్కారాలు చేయడం.. తద్వారా తమ కార్యక్రమాలకు ప్రచారం పొందడం మామూలే. ఐతే సంపూతో పాటు కొందరిని ఇలా వేడుకలకు పిలిచి.. అమర్యాదకరంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ సంఘం వేడుకలకు సంపూను పిలవగా.. ఐతే ఆహ్వాన పత్రికలో తన పేరు కమెడియన్ల పక్కన వేయడంపై అతను అలిగి ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. తాజాగా మరోసారి ఇలాంటి వేడుకల విషయంలోనే వివాదంలోకి ఎక్కాడు సంపూ.