Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: వాక్సీన్ లేని వైరస్.. సంపూ
By: Tupaki Desk | 8 Jan 2017 6:28 PM GMTచేసినవి తక్కువ సినిమాలే అయినా సంపూర్ణేష్ బాబుకి బోలెడంత గుర్తింపు ఉంది. హృదయకాలేయంతో బర్నింగ్ స్టార్ అనిపించేసుకున్నాక.. రకరకాల చిత్రవిచిత్రమైన పేర్లతో సినిమాలు చేశాడు కానీ.. అందులో విడుదలైనవి తక్కువే. సింగం 123 అంటూ స్ఫూఫ్ లతో ఓ మూవీ రిలీజ్ అయినా అది ఆకట్టుకోలేదు. ఇక కొబ్బరిమట్ట లాంటి డిఫరెంట్ టైటిల్స్ ఆకట్టుకునే సంపూర్ణేష్ బాబు.. మరో వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.
సంపూ నటిస్తున్న కొత్త సినిమా పేరు వైరస్. 'నో వ్యాక్సీన్.. ఓన్లీ టాక్సిన్' అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. ఇప్పుడీ వైరస్ కి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బ్రాహ్మిన్ గెటప్ లో నటరాజ స్వామి ముందు ఓ నాట్యకారుడి టైపులో మెలికలు తిరుగుతూ.. పెద్ద పిలకతో కనిపిస్తున్న సంపూర్ణేష్.. ఈ ఫస్ట్ లుక్ లో కనిపి్తాడు. చుట్టూ సంగీత వాయిద్యాల మధ్య. ఓ విద్వాంసుడి టైపులో పోజ్ అన్నమాట.
సంగీతానికి పట్టిన వైరస్ గా సంపూ చేస్తున్నాడో.. వైరస్ ని వదిలించే పని పెట్టుకున్నాడో అనుకోకండి. ఇది భయంకరమైన హారర్ కామెడీతో పాటు.. మర్డర్ మిస్టరీతో థ్రిల్లర్ మూవీ అంటున్నాడు దర్శకుడు ఎస్.ఆర్. కృష్ణ. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే.. సమాజంలో విలువలను కూడా ఈ వైరస్ రూపంలో ప్రశ్నిస్తాడట బర్నింగ్ స్టార్.