Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: చావంటే సంపూలా ఉంటుంది

By:  Tupaki Desk   |   2 May 2017 12:12 PM GMT
ట్రైలర్ టాక్: చావంటే సంపూలా ఉంటుంది
X
సంపూర్ణేష్ బాబు సినిమా అంటేనే ఓవరాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ అనడంలో సందేహం లేదు. విచిత్రమైన ఆకారం.. చిత్రాతి చిత్రమైన నటన.. అతిశయానికి అర్ధం చెప్పేలా కాన్సెప్టులు.. మొత్తం మీద సంపూ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే.. అతికి పరాకాష్ట.

హృదయ కాలేయం లాంటి చెత్త కాన్సెప్ట్ తో చెత్త సినిమా(సంపూనే చెప్పాడిలా) చేసి సక్సెస్ కొట్టిన సంపూర్ణేష్.. ఆ తర్వాత ఆ స్థాయిలో హిట్ కాలేదు. కొబ్బరి మట్ట అంటూ ఏడాదిగా ఊరిస్తున్నాడు కానీ.. పోస్టర్లు తప్ప సినిమా రావడం లేదు. ఇప్పుడు వైరస్ అంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానంటున్నాడు సంపూ. ఈ వైరస్ కి టీజర్ కూడా ఇచ్చేశాడు. 'జీవితంలో ఆడుకుంటే పర్లేదు.. జీవితాలతో ఆడుకున్నావ్' లాంటి బరువైన డైలాగ్స్ నే ట్రైలర్ లో చొప్పించినా.. సంపూ చెప్పేసరికి కామెడీ అయిపోయాయి. ఎప్పటిలాగానే తన స్టైల్ వెరైటీ అతి నటననే మళ్లీ రిపీట్ చేశాడు సంపూర్ణేష్.

రకరకాల జోనర్లను ఒకే మూవీలో మిక్స్ చేసి చూపించినట్లుగా టీజర్ కట్ చేశారు. 'అదే మృత్యువు మనిషి రూపంలో వస్తే.. నాలాగుంటుందిరా.. ప్యాకప్' అంటూ వైరస్ టీజర్ ఫినిషింగ్ లో సంపూ చెప్పిన డైలాగ్ బాగానే పేలింది. సినిమా బాగుంటే ఓకే కానీ.. ఒక వేళ పేలిపోతే మాత్రం.. ఈ మృత్యువు డైలాగ్ సంపూర్ణేష్ కి రివర్స్ పంచ్ అయిపోతుంది. నిజంగా సంపూ చంపేశాడ్రా అనుకుంటారు జనాలు. జర భద్రం సంపూ!