Begin typing your search above and press return to search.

పెద్ద మనసు చాటుకున్న సంపూర్ణేశ్ బాబు

By:  Tupaki Desk   |   1 July 2021 2:41 PM GMT
పెద్ద మనసు చాటుకున్న సంపూర్ణేశ్ బాబు
X
సినిమా ఇండ‌స్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. ప్రేక్ష‌కులు లేక‌పోతే తాము లేనే లేమ‌ని ఉప‌న్యాసాలు ఇస్తుంటారు. కానీ.. వాళ్ల హృద‌యం మాత్రం అత్యంత ఇరుకు. క‌ష్టాల్లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు క‌నీసం రూపాయి కూడా దానం చేయ‌రు. కానీ.. చిన్న న‌టుడైనా త‌న మ‌న‌సు ఎంత విశాల‌మైన‌దో చాటిచెబుతున్నారు సంపూర్ణేశ్ బాబు.

ఇప్పటికే ప‌లుమార్లు క‌ష్టాల్లో ఉన్న‌వారికి స‌హాయం అందించిన సంపూ.. తాజాగా మ‌రో కుటుంబానికి చేయూత‌నిచ్చాడు. తెలంగాణ‌లోని దుబ్బాక ప్రాంతానికి చెందిన న‌ర‌సింహాచారి దంప‌తులు అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీంతో.. వారి ఇద్ద‌రు కుమార్తెలు అనాథ‌లు అయ్యారు. ఈ విష‌యం తెలుసుకున్న సంపూర్ణేశ్ రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు.. ఆ పిల్ల‌ల చ‌దువు బాధ్య‌త‌ను తానే తీసుకుంటున్న‌ట్టు చెప్పారు.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు సంపూ. ''మా నిర్మాత సాయి రాజేష్, నేను కలిసి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాం. అంతేకాకుండా.. వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను కూడా మేమే చూసుకుంటాం'' అని చెప్పి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నారు సంపూ.

కాగా.. గ‌తంలో విశాఖ‌ వ‌ర‌ద‌ల స‌మ‌యంలోనూ త‌న వంతు స‌హాయం అందించాడు సంపూర్ణేశ్‌. ఇటీవ‌ల మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్ట్ టీఎన్ఆర్ కుటుంబానికి రూ.50 వేలు స‌హాయం చేశాడు. సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం మూడు చిత్రాల్లో న‌టిస్తున్నారు సంపూర్ణేశ్‌. బ‌జారు రౌడీ, పుడింగి నంబ‌ర్ వ‌న్‌, క్యాలీఫ్ల‌వ‌ర్ చిత్రాలు చేస్తున్నారు.