Begin typing your search above and press return to search.

సంపూ అంటే ముమైత్ కు ఎంతపిచ్చంటే...

By:  Tupaki Desk   |   23 Dec 2016 7:30 AM GMT
సంపూ అంటే ముమైత్ కు ఎంతపిచ్చంటే...
X
ఒక ఊహించని అనుభవం బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు ఎదురైందనే చెప్పాలి. అందం, హీరోస్థాయి పర్సనలిటీ వంటి సంగతులు కాసేపు పక్కనపెడితే సంపూ ఒక కామెడీ హీరో. సంపూకంటూ ఒక ప్రత్యేక అభిమాన జనం ఉన్నారు. మొన్నటివరకూ యూట్యూబ్ లో సంపూని చూసి ఆనందించినవారంతా.. వెండితెరపై సంపూ కామెడీకి కడుపుబ్బా నవ్వుకున్నారు. అయితే సంపూకి ఉన్న అభిమానుల్లో.. కాదు కాదు వీరాభిమానుల్లో ఐటం రాణి ముమైత్ ఖాన్ ఒకరు! నమ్మడానికి కాస్త అనుమానంగా ఉన్నట్లు అనిపిస్తున్నా ఇది అక్షరాలా వాస్తవం.

అవును... "సంపూ.. నువ్వు నా దృష్టిలో ఒక సూపర్ స్టార్.. నాడు యూ ట్యూబ్‌ లో నీ వీడియోలు చూశాను.. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వ్యూయర్స్ నీ గురించి, నీ కామెడీ సీన్ల గురించి రివ్యూలు ఇస్తుంటారు.. అనారోగ్యంతో ఉన్నపుడు ఆ నీరసం నుంచి కోలుకోవడానికి నీ కామెడీతో నవ్విస్తూ నాకెంతో సాయం చేశావు.. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది" ఇది గురువారం జెమినీ టీవీ అవార్డుల కార్యక్రమానికి సంపూతో పాటు హాజరైన అనంతరం ట్విట్టర్ లో ముమైత్ స్పందన. ఈ ఒక్క ట్వీట్ చాలు కదా... సంపూపై ముమైత్ కి ఉన్న అభిమానం గురించి చెప్పడానికి.

అంతకు ముందుకూడ... సంపూని కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ ఎగ్జైట్ మెంట్ తో కూడిన ట్వీట్ ని కూడా పోస్ట్ చేసింది ముమైత్. ఇంతవరకూ బాగానే ఉంది కానీ... ముమైత్ చూపించిన అభిమానానికి సంపూ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందంటారు? అవును అలాగే ఉండి ఉంది! ఈ విషయం అనంతరం ఉబ్బితబ్బిబ్బయిపోయిన సంపూ స్పందించడానికి మాటలు రావట్లేదని అనేశాడు. ఈస్థాయిలో అభిమాన నటుడు - అందాల అభిమాని సంభాషణంతా చూసిన తర్వాత ఇది నిజమేనా లేక కామెడీలో భాగమా అనే అనుమానాలొద్దు.. మీరు నమ్మి తీరాలంటే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/