Begin typing your search above and press return to search.

సంపూ.. ఇక కష్టమే గురూ

By:  Tupaki Desk   |   30 Dec 2015 7:30 AM GMT
సంపూ.. ఇక కష్టమే గురూ
X
స్ఫూఫ్‌లు తెలుగు సినిమాకి కొత్తేం కాదు. మ‌న క‌మెడియ‌న్లంతా స్ఫూఫ్‌ లు చేసి ఎదిగిన‌వారే. అస‌లు ఊరూ పేరూ తెలియ‌ని వాళ్లు కూడా ఇలాంటి ఊర‌మాస్ కామెడీతోనే అంద‌రికీ తెలిసిపోతున్నారు. అయితే ఈ స్ఫూఫ్‌ ల‌కు ప‌రాకాష్ట అంటే ఏంటో న‌రేష్ సుడిగాడు సినిమాలో చూపించాడు. దానికి కొన‌సాగింపు అన్న‌ట్టే సంపూర్ణేష్‌ బాబు వ‌చ్చాడు. అత‌డు వ‌స్తూనే హృద‌య కాలేయం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ - సెలైరిక‌ల్ స్ఫూఫ్‌ ల‌తో విరుచుకుప‌డ్డాడు. మొద‌టి సినిమా హిట్టయ్యింది. ఆ త‌ర్వాత మ‌రోసారి అదే పంథాలో సింగం 123 అంటూ మ‌రో స్ఫూఫ్ కామెడీ చేశాడు. అయితే ప‌దే ప‌దే ఇదే త‌ర‌హా సినిమాలు చేస్తూ అత‌డు తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌గ‌ల‌డా?

మారిన ట్రెండ్‌ లో స్ఫూఫ్‌ ల‌కు కాలం చెల్లిపోయింది. ఆ సంగ‌తిని ఇటీవ‌లి కాలంలో రిలీజైన కొన్ని సినిమాలు నిరూపించాయ్. అందుకే మొహం మొత్తేసే ఊర‌మాసు స్ఫూఫ్‌ల‌పైనే డిపెండ్ అయ్యి కెరీర్ బండిని నెట్టుకొచ్చేయ‌గ‌ల‌వా సంపూ? అని ప్ర‌శ్నిస్తున్నారు క్రిటిక్స్‌. ఇలాంటివే చెయ్‌. నిన్ను హీరోని చేస్తాం అంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యాష్ బ్యాగ్‌ తో రెడీగా ఉంటే చేయ‌డం త‌ప్పేం కాదు మ‌రి. అందుకే ఈ స్ఫూఫ్ క‌థ‌లు ఒప్పుకుంటున్నావా బ‌య్యా? ఇలాంటి పరిస్థితి ప‌గ‌వాడికైనా రాకూడ‌దు మ‌రి. ప్ర‌స్తుతం సంపూ న‌టించిన డ‌బ్ల్యూడ‌బ్ల్యూడ‌బ్ల్యూ డాట్ వైర‌స్ డాట్ కాం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయ్‌. ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సిహెచ్ రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతా షా క‌థానాయిక‌గా న‌టించింది. స్ఫూఫ్‌ ల‌లో ఎక్స్‌ క్లూజివ్ ఏం ఉంటుందో చూడాలి మ‌రి!