Begin typing your search above and press return to search.

మరో సెన్సేషనల్ క్యారెక్టర్లో సంపూ

By:  Tupaki Desk   |   30 Dec 2015 10:30 PM GMT
మరో సెన్సేషనల్ క్యారెక్టర్లో సంపూ
X
‘హృదయ కాలేయం’ అంటూ ఓ అర్థం పర్థం లేని టైటల్ పెట్టుకుని.. తలాతోకా లేని సినిమా తీసి.. తనకే సొంతమైన క్రేజ్ తో సినిమాను హిట్ చేసుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఆ తర్వాత అతను హీరోగా నటించిన ‘సింగం 123’ దారుణమైన ఫలితాన్నిచ్చినప్పటికీ.. సంపూలో ఉత్సాహం ఏమీ తగ్గలేదు. ‘హృదయ కాలేయం’ టీంతో ‘కొబ్బరిమట్ట’ అంటూ ఓ సినిమా చేస్తూనే.. సైలెంటుగా ‘డబ్బ్యూడబ్ల్యూడబ్ల్యూ.వైరస్.కామ్’ పేరుతో ఇంకో సినిమా అవగొట్టేశాడు సంపూ. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

వైరస్.కామ్ సినిమాకు క్యాప్షన్ ఏంటో తెలుసా.. ‘నో క్యాప్షన్స్... ఓన్లీ టాక్సిన్స్’. అంటే సంపూ బాబు డేంజరస్ వైరస్ అన్మమాట. ఆ వైరస్ తో పెట్టుకుంటే పెట్టుకుని ప్రాణాలు పోవాల్సిందే. సీహెచ్ శివరామకృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సలీం ఎండీ, కళ్యాణ్ ధూళిపాళ్ల నిర్మాతలుగా పరిచయమవుతున్నారు. సంపూ సరసన గీత్ షా అనే కొత్త హీరోయిన్ నటిస్తోంది. ఈ అమ్మాయితో కలిసి సంపూ వీర లెవెల్లో స్టెప్పులేస్తున్న ఫొటోల్ని రిలీజ్ చేశారు. అందులో సంపూ రొమాంటిక్ టచ్ చూస్తే అమ్మాయిల మతులు పోవడం ఖాయం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుందట.