Begin typing your search above and press return to search.
సామ్రాట్ బావ అతనికి పడిపోయాడట
By: Tupaki Desk | 18 Feb 2017 6:32 AM GMTప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కిట్టు ఉన్నాడు జాగ్రత్త. కుక్కల కిడ్నాప్ థీమ్ తో రూపొందే ఈ చిత్రంలో సీరియస్ అంశాలు కూడా బోలెడన్ని కనిపించనున్నాయి. లీడ్ విలన్ రోల్ కి బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ ను తీసుకొచ్చారంటేనే.. ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యం అర్ధమవుతుంది.
అర్బాజ్ ఖాన్ కు సోదరుడిగా.. మరో విలన్ పాత్రధారిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు సామ్రాట్. బావ చిత్రంలో నెగిటివ్ రోల్ లో ఆకట్టుకున్న సామ్రాట్.. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. కానీ ఇప్పుడు అర్బాజ్ ఖాన్ విలన్ గా.. రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న క్రేజీ మూవీలో లీడ్ రోల్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెబుతున్నాడు సామ్రాట్. 'అర్బాజ్ సోదరుడిగా అతని ప్లాన్స్ ను నేను అమలు చేస్తుంటాను. యాక్షన్.. పెర్ఫామెన్స్ రెండిటికీ స్కోప్ ఉన్న రోల్ ఇది' అంటున్నాడు సామ్రాట్.
'అర్బాజ్ తో నటించడం ఎన్నో కొత్త పాఠాలను నేర్పింది. అంత పెద్ద స్టార్ అయినా.. సెట్స్ కు సరైన టైంకి వచ్చేస్తారు. యాక్టింగ్ ను ఇంప్రూవ్ చేసుకోవడంలో ఆయన్నుంచి చాలానే నేర్చుకొన్నాను. తెలుగు రాకపోయినా.. ప్రతీ డైలాగ్ ను అర్ధం చేసుకుని నటించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు నాకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి' అని చెప్పాడు సామ్రాట్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/