Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ పై వ్యతిరేకత ఎంత?
By: Tupaki Desk | 24 Aug 2018 5:31 AM GMTస్టార్-మాలో `బిగ్ బాస్ సీజన్ 2` ముదిరిపాకన పడుతున్న సంగతి తెలిసిందే. నాని హోస్టింగ్ చేస్తున్న ఈ షోకి టీఆర్ పీ ఎలా ఉంది అన్నది అప్రస్తుతం. అసలు ఈ రియాలిటీ షోపై జనాల వ్యూ ఏంటి? అన్నది చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి ఈ షో మాస్ కి ఎక్కినంతగా క్లాస్ జనాలకు ఎక్కిందా? అంటే నో అనే చెబుతున్నారు. బిగ్ బాస్ షోపై పాజిటివిటీ ఎంతో నెగెటివిటీ అంతకు రెట్టింపు.
గొప్ప వినోదం అంటూ టీవీలకు అతుక్కుపోయేవాళ్లు ఉన్నట్టే, ఇంత దారుణమైన బుల్లితెర షో వేరొకటి లేనేలేదని విమర్శించేవాళ్లు అంతకుమించి ఉన్నారు. అసలు ఈ షో వస్తే అసహ్యించుకుని టీవీలు కట్టేసే వాళ్లకు కొదవేం లేదు. రాత్రి వేళల్లో గంటన్నర పాటు షోకి కళ్లు అతికించి ఇల్లాళ్లు ఈ షో చూడడం వల్ల కొంప కొల్లేరయిపోతోందనే మొగుళ్ల వ్యథ బయటపడుతోంది. ఇప్పటికే డిప్రెస్డ్ జాబ్స్ తో సతమతమవుతున్న ఉద్యోగులు ఇంటికొచ్చేసరికి వినోదం స్థానంలో విరక్తి కనిపిస్తోందన్న దారుణ విమర్శ వినిపిస్తోంది. ఒకే ఇంట్లో డివైడ్ టాక్ నడుస్తుంటే - ఒకరు షో చూస్తామంటే - ఇంకొకరు టీవీ కట్టేస్తామంటారు. అలాంటి డివైడ్ గొడవలకు దారి తీస్తోంది. ఇదోరకం కొంపకొల్లేరు వ్యవహారం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పాశ్చాత్య దేశాల కల్చర్ ని తెచ్చి మన కల్చర్ ని సర్వనాశనం చేసిన బిగ్ బాస్ షోపై సౌత్ లో పలు చోట్ల నిరసనలు - కోర్టు కేసులు ఉన్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే తమిళనాడులో అయితే బిగ్ బాస్ షోకి బోలెడన్ని ఆటంకాలు కలిగాయి. ప్రస్తుతం తెలుగు నాట మొగుడు-పెళ్లాల కాపురాల్లో చిచ్చుపెడుతున్న గంటన్నర లాంగ్ షోపైనా తీవ్ర విమర్శలున్నాయి. ఇది కొందరికే వినోదం అనుకుంటే - చాలామందికి తలబొప్పి కట్టించే కార్యక్రమంగానూ కనిపిస్తోంది. షో వస్తున్నంత సేపూ మొగుడు మాట వినని పెళ్లాలతో తంటా మరీ కాపురంలో కలతలు తెచ్చేదిగా ఉందన్న విమర్శ వినిపిస్తోంది. ఈ షోలో ఎమోషన్స్‌కి జనం కనెక్టయిపోతున్నారని ప్రచారం సాగినా - జనాల టీవీక్షణ బలహీనత తప్పుదారి పట్టిస్తుందేమో? అన్న సందేహాలు లేకపోలేదు. ఎవరో వస్తారు.. వాళ్లకు నచ్చినట్టు బిహేవ్ చేస్తారు. తోచిందే మాట్లాడతారు. తిక్క వేషం వేస్తారు. అలాంటప్పుడు అందులో ఏం వినోదం ఉంది? బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ లు పేరుతో ఏవేవో వెకిలి పనులు చేయిస్తుంటారు. అవన్నీ గొప్ప ఎంటర్ టైన్ మెంట్ అనే అనుకోవాలా? ఈ వారం పెళ్లయిన గాయని గీతామాధురి బుగ్గపై ముద్దు పెట్టేశాడు సామ్రాట్. ఇదేనా అసలు వినోదం? ఇదేనా గొప్ప టాస్క్? ఎవరినుద్ధరించే టాస్క్ లు ఇవి? మనిషి బలహీనతల్ని సొమ్ము చేసుకునే టాస్క్‌లు కావా ఇవి? అయినదానికి కానిదానికి విరుచుకుపడే మహిళా మండళ్లు ఇప్పటివరకూ ఈ షోపై సైలెంట్ గా ఉండడాన్ని అభినందించాలి!!