Begin typing your search above and press return to search.
దీన్ని డిజాస్టర్ కాదు.. అంతకు మించి అనాలేమో!
By: Tupaki Desk | 24 Jun 2022 3:30 AM GMTబాలీవుడ్ బాహుబలి అంటూ ప్రచారం చేసిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా ఇండియన్ సినిమా పరువు తీసినంత పని చేసింది. దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించడంతో పాటు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ ను ఈ సినిమాలో నటింపజేశారు. దాంతో బాహుబలి కంటే కాస్త ఎక్కువగానే ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.
సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు ముందు హిందువుల చరిత్రను స్కూల్ పిల్లలకు ఎందుకు చెప్పడం లేదు అంటూ హీరో అక్షయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. దాంతో ఈ సినిమా గురించి మరింత గా జనాల్లో చర్చ జరిగింది. మొత్తానికి బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో కూడా ఈ సినిమా పై ఆసక్తి మరియు అంచనాలు భారీగా ఉండగా సినిమా విడుదల అయ్యింది.
ఇంత భారీ అంచనాలున్న సినిమా సాధారణంగా అయితే మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి. కాని పృథ్వీరాజ్ సినిమా అత్యంత దారుణమైన ఓపెనింగ్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఒక హిందీ సినిమా అది కూడా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా ఇలా తక్కువ వసూళ్లు సాధించడం ఏంటో అంటూ అంతా ముక్కున వలేసుకున్నారు.
ఇంతకు పృథ్వీరాజ్ సినిమా సాధించిన వసూళ్లు ఎంతో తెలుసా... ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కు 20 రోజుల్లో వచ్చిన వసూళ్లు 78.5 కోట్లు గా సమాచారం అందుతోంది.
మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా... 250 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా లాంగ్ రన్ లో కనీసం వంద కోట్లు కూడా వసూళ్లు చేయకుంటే డిజాస్టర్ అనే పదం కూడా తక్కువే అని.. దీనికి అంతకు మించి ఏమైనా పేరు పెట్టాలి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.
సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా లో భారీ యుద్ద సన్నివేశాలతో పాటు దర్శకుడు సాధ్యం అయినంత వరకు కమర్షియల్ ఎలిమెంట్స్ ను జొప్పించే ప్రయత్నం చేశాడు. సినిమాకు పర్వాలేదు అన్నట్లుగానే టాక్ వచ్చింది. అయినా కూడా వసూళ్లు దారుణంగా వచ్చాయి. బాలీవుడ్ బాహుబలి అన్నారు.. మరి ఇప్పుడు ఏం అంటారు అంటూ సోషల్ మీడియాలో కొందరు యూనిట్ సభ్యులను ఎద్దేవ చేస్తున్నారు.