Begin typing your search above and press return to search.

న‌టుడు సామ్రాట్‌ పై కేసు పెట్టిన భార్య‌?

By:  Tupaki Desk   |   30 Jan 2018 5:10 AM GMT
న‌టుడు సామ్రాట్‌ పై కేసు పెట్టిన భార్య‌?
X
టాలీవుడ్ న‌టుడు సామ్రాట్ రెడ్డిపై కేసు న‌మోదైంది. కొంచెం ఇష్టం.. కొంచెం క‌ష్టం.. పంచాక్ష‌రి.. తకిట త‌కిట‌.. అహ‌నా పెళ్లంట‌.. బావ ఇలా ప‌లు చిత్రాల్లో న‌టించిన సామ్రాట్ పై ఆయ‌న స‌తీమ‌ణి పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.త‌న భ‌ర్త త‌న‌ను వేధింపుల‌కు గురి చేస్తున్న‌ట్లుగా సోమ‌వారం రాత్రి ఆమె మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌ముఖ మోడ‌ల్‌.. ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి చిన్న త‌మ్ముడే సామ్రాట్‌. సినిమా రంగం మీద విప‌రీత‌మైన ఆస‌క్తి ఉండ‌టంతో ఈ రంగంలోకి వచ్చాడు. 2015లో వీరి వివాహం జ‌రిగింది. అప్ప‌ట్లో ఎన్ క‌న్వెష‌న్ సెంట‌ర్లో వీరి పెళ్లి అంగ‌రంగ వైభోగంగా జ‌రిగింది. దీనికి ప్ర‌ముఖ రాజ‌కీయ.. సినిమా.. పారిశ్రామిక రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇప్పుడు తాజాగా పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు న‌మోదు కావ‌టం.. పెద్ద‌ల వ్య‌వ‌హారం కావ‌టంతో పోలీసులు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతానికి సంబంధించిన మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.