Begin typing your search above and press return to search.

దేవి కొట్టాడా? లేక కొట్టేశాడా?

By:  Tupaki Desk   |   25 Jun 2017 4:50 AM GMT
దేవి కొట్టాడా? లేక కొట్టేశాడా?
X
మన సినిమావాళ్ళు.. మ్యూజిక్ కంపోజర్స్ పక్క సినిమా ఇండస్ట్రి నుండి కాపీ కొడుతున్నారని మనం చాలాసార్లు విన్నాం. ముఖ్యంగా కొన్ని ఏళ్ళ కిందట కోటి కొట్టిన కొన్ని పాటల ట్యూన్లు హింది నుండి ఇంగ్లిష్ నుండి తీసుకొచ్చాడు. మణి శర్మ పై కూడా ఇలాంటి వాదనలు చాలా వచ్చాయి ఉన్నాయి. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి కూడా ఇలాంటివి చాలా విన్నాం. అక్కడ బాగా పాపులర్ అయినవి వీళ్ళు అలానే కాపీ పేస్ట్ షార్ట్ కట్ కీ వాడినట్లు ఇక్కడ వాడేశారు. కొన్నిసార్లు అడ్డంగా దొరికేశారు కూడాను.

ఇప్పుడు కూడా దేవిశ్రీ ప్రసాద్ పై ఒక చర్చ జరుగుతోంది. ఈ మధ్యనే సామ్ సంగ్ వాళ్ళు ఒక టి‌వి కమర్షియల్ యాడ్ విడుదల చేశారు గెలాక్సీ j7 ఫోన్ కోసం. ఆ యాడ్ మ్యూజిక్ మన నాని ‘నేను లోకల్’ సినిమాలో ‘నెక్స్ట్ ఏంటి’ అనే పాటలా అనిపించింది. నెక్స్ట్ ఏంటి పాట మొదలుకాకముందు వచ్చే బీట్ - ఇప్పుడు విడుదలైన సామ్ సంగ్ గెలాక్సీ j7 యాడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకేలాగా ఉండటం ఈ చర్చకు కారణం అయింది. వెంటనే మనవాళ్లు రిసర్చ్ చేసేశారు దానిపై. నేను లోకల్ సినిమా వచ్చింది మార్చ్ మాసంలో , ఈ యాడ్ విడుదల అయింది కొద్ది రోజులు కిందటనే. అయితే ఇప్పుడు ఎవరు ఎవరిని కాపీ కొట్టారు అనేది తెలియటంలేదు.

ఎక్కడో వచ్చిన ట్యూన్ ను దేవిశ్రీ కాపీ కొట్టేశాడా? లేక సామ్ సంగ్ వాళ్ళు దేవి శ్రీ ప్రసాద్ ను అడిగి ఉంటే.. ఈ యాడ్ కు ఆ ట్యూన్ కొట్టాడా? ఏది ఏమైనా ఈ విషయం పై ఇంకా పూర్తిగా ఎవరు ఎవరిని కాపీ కొట్టారు అనేది చెప్పలేము. అతనే ఆ యాడ్ చేసి ఉంటే తన ట్యూన్ తను వాడుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఏ ఆర్ రహమాన్ - ఇళయరాజా కూడా వాళ్ళు కంపోజ్ చేసిన ఒక పాట ట్యూన్ ని కమర్షియల్ యాడ్ లో వాడుకున్నారులే.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/