Begin typing your search above and press return to search.
అఖిల్ కి నాన్నను సెట్ చేశారా?
By: Tupaki Desk | 7 July 2019 9:19 AM GMTమొదటి సినిమానే ఇంటిపేరుగా మార్చుకునే సక్సెస్ అందరికి దక్కదు. అందులోనూ దర్శకులకు ఇది అరుదుగా దొరికే అదృష్టం. బొమ్మరిల్లుతో ఈ ఖ్యాతిని అందుకున్న భాస్కర్ ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకునేలా సినిమాలు తీయలేకపోవడంతో ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. రామ్ చరణ్ ఆరంజ్ రామ్ ఒంగోలు గిత్త ఒకదాన్ని మించి మరొకటి ఇతని కెరీర్ ని బాగా ప్రభావితం చేశాయి.
మలయాళం హిట్ మూవీ బెంగుళూరు డేస్ ని తమిళ్ లో రీమేక్ చేస్తే అదీ తేడా కొట్టేసింది. అయినా గీతా బ్యానర్ లో అఖిల్ హీరోగా ఛాన్స్ దక్కడం విశేషమే. కథలో చాలా విషయం ఉంటే తప్ప ఒప్పుకోని సంస్థలో ఆఫర్ రావడం చిన్న విషయం కాదుగా. అందులోనూ అఖిల్ కు ఖచ్చితంగా ఇవ్వాల్సిన టార్గెట్ తో ఇది రూపొందుతోంది.
తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో నాన్న పాత్ర కోసం తమిళ నటుడు సముతిరఖనిని ఎంపిక చేశారట. ఈయన ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ బాబాయ్ గానో మావయ్యగానో నటిస్తున్నాడు. దీంతో పాటు రాజమౌళి అబ్బాయి కార్తికేయ రూపొందిస్తున్న ఆకాశవాణిలో కూడా మరో రోల్ ఇచ్చారు. ఇప్పుడిది మూడో తెలుగు స్ట్రెయిట్ మూవీ అవుతుంది. ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని తెలిసింది. బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ ద్వారా మర్చిపోలేని తండ్రి పాత్రకు జీవం పోసిన భాస్కర్ ఇప్పుడు దీంట్లో కూడా అదే మేజిక్ రిపీట్ చేస్తాడా అనే ఆసక్తి నెలకొంది.