Begin typing your search above and press return to search.
ఆర్ ఆర్ ఆర్ లో మరో ఆకర్షణ
By: Tupaki Desk | 24 Jan 2019 9:55 AM GMTటాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్త సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ రెండో షెడ్యూల్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. దాని తాలుకు అప్ డేట్స్ ఎలాంటి లీకుల రూపంలో బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న జక్కన్న టీం మరోపక్క ఆర్టిస్ట్ సెలక్షన్ కూడా వేగవంతం చేసింది. ఇప్పటికీ హీరొయిన్లు ఎవరో చెప్పలేదు. రేపు ఎల్లుండి అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అదలా ఉంచితే గతంలో వచ్చిన ఓ అనధికార వార్త ఇప్పుడు నిజమైంది.
వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు కం నటుడు సముతిరఖని ఆర్ ఆర్ ఆర్ లో నటించడం స్వయానా ఆయనే కన్ఫర్మ్ చేసాడు. రాజమౌళి తనకు పూర్తి కథను వివరించాకే ఒప్పుకోమని అడిగాడని కాని తనకు ఆ అవసరం కనిపించలేదన్న సముతిరఖని వచ్చే షెడ్యూల్ లో ఎంటరయ్యే అవకాశం ఉంది. తన పాత్ర తీరుతెన్నులను మాత్రం ఆయన చెప్పలేదు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం సముతిర ఖని ఇందులో రామ్ చరణ్ అంకుల్ అదే మావయ్యగా కనిపించబోతున్నట్టు సమాచారం. మరి ఇతనికి జూనియర్ ఎన్టీఆర్ కూ ఏమైనా లింక్ ఉంటుందా అంటే ప్రస్తుతానికి అది సస్పెన్స్.
తన పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతోందని మాత్రమే చెబుతున్నాడు సముతిరఖని. మనవాళ్ళకు మొదట్లో పెద్దగా తెలియదు కాని ధనుష్ రఘువరన్ బిటెక్ లో హీరో తండ్రి వేషంలో సముతిరఖని పెర్ఫార్మన్స్ కి ఇక్కడ బాగా కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత కాలా లాంటి డబ్బింగ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన సముతిరఖని ఫుల్ లెంగ్త్ స్ట్రెయిట్ మూవీ తెలుగులో చేయడం ఇదే మొదటిసారి. కోలీవుడ్ నటులు తెలుగు సినిమాల్లో నటించడం కొత్తేమి కాదు కాని సముతిరఖని లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ త్వరగా రావడం శుభసూచకం