Begin typing your search above and press return to search.
#RRR : అబ్బాయికి బాబాయి పాత్రలో ఆయన
By: Tupaki Desk | 1 May 2019 2:14 PM GMTతమిళ ప్రముఖ దర్శకుడు - నటుడు అయిన సముద్ర ఖని 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్' లో సముద్రఖని పాత్ర ఏంటీ అంటూ గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా ఆ విషయమై సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కు బాబాయి పాత్రలో సముధ్ర ఖని కనిపించబోతున్నాడట. సినిమాలో ఈయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. చరిత్ర చెబుతున్న దాని ప్రకారం కొమురం భీంకు ఉద్యమ పాఠాలు నేర్పించింది, ఉద్యమ స్ఫూర్తిని కలిగించింది మొదట్లో ఆయన బాబాయేనట. బాబాయి ఒక స్వాతంత్య్ర సమరయోధుడు అవ్వడం వల్ల కొమురం భీంకు కూడా స్వాత్యంత్య్ర ఉద్యమం చేపట్టాలనే స్ఫూర్తి వచ్చినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే కీలకమైన కొమురం భీం పాత్రకు గాను విభిన్న నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్రఖనిని ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది.
రాజమౌళి తాను అనుకున్న పాత్రకు ఎవరు అయితే బాగుంటారో ఒకటికి పది సార్లు ఆలోచించి వారిని తీసుకుంటాడు. సముద్రఖనిని తీసుకున్నాడు అంటే ఆయన ఎంతగా ఆలోచించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ చిత్రంతో సముద్ర ఖని నటుడిగా తన స్థాయిని పెంచుకోవడంతో పాటు, తెలుగు ప్రేక్షకులకే కాకుండా ఇండియా వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం. ఇంకా ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన రామ్ చరణ్ కు సపోర్టింగ్ క్యారెక్టర్ అయ్యి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇలాంటి విషయాలు మరెన్నో బయటకు వచ్చి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయడం ఖాయం.