Begin typing your search above and press return to search.

'సార్‌'పైనే సంయుక్త ఆశ‌లు.. హ్యాట్రిక్ కొడితే ద‌శ తిరుగుద్ది!

By:  Tupaki Desk   |   25 Nov 2022 11:30 PM GMT
సార్‌పైనే సంయుక్త ఆశ‌లు.. హ్యాట్రిక్ కొడితే ద‌శ తిరుగుద్ది!
X
సంయుక్త మీనన్.. కేరళ రాష్ట్రంలో జన్మించిన ఈ అందాల సోయగం గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. 2016లో వచ్చిన 'పాప్‌కార్న్' అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సంయుక్త మీనన్.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది. మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

తమిళ్‌, కన్నడ భాషల్లోనూ అడపా త‌డ‌పా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. 'భీమ్లా నాయక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

ఇందులో రానాకు జోడీగా సంయుక్త‌ ప్రెగ్నెంట్ లేడీ పాత్ర‌ను పోషించి ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ 'బింబిసార' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.

అయితే వరుసగా రెండు హిట్లు ప‌డినా టాలీవుడ్ లో సంయుక్తకు ఆఫర్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుత ఈ అమ్మడు ఆశలన్నీ 'సార్' పైనే పెట్టుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించింది.

సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌-ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై నాగ‌వంశి-సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుదల కాబోతోంది.

ఈ సినిమాతో సంయుక్త మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకోవాలని ఆశ పడుతుంది. ఒకవేళ అదే జరిగి హ్యాట్రిక్ హిట్ కొట్టిందంటే టాలీవుడ్ లో సంయుక్త దశ తిరగడం ఖాయమని అంటున్నారు. గోల్డెన్ లెగ్ అనే ముద్రతో పాటు స్టార్ హీరోల‌ సరసన ఆడిపాడే అవకాశాలు సైతం సంయుక్త‌కు వస్తాయని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.