Begin typing your search above and press return to search.

గాసిప్స్ పై సంయుక్తా మీన‌న్ స్వీట్ సెటైర్!

By:  Tupaki Desk   |   26 July 2022 3:36 PM GMT
గాసిప్స్ పై సంయుక్తా మీన‌న్ స్వీట్ సెటైర్!
X
మ‌ల‌యాళం బ్యూటీ సంయుక్తామీన‌న్ `భీమ్లానాయ‌క్` తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమానే అమ్మ‌డు స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది. రాణా భార్య పాత్ర లో బ్యూటీ మెప్పించింది. ఇప్పుడా స‌క్సెస్ తోనే మ‌రో రెండు సినిమాల్లో కూడా అవ‌కాశాలు అందుకుంది. ధ‌నుష్ టాలీవుడ్ లాంచ్ మూవీ `సార్ `లో న‌టిస్తోంది. అలాగే క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న `బింబిసార‌`లోనూ న‌టిస్తోంది.

ఈ రెండు కూడా పెద్ద సినిమాలే కావ‌డంతో సంయుక్త బాగానే ఫేమ‌స్ అవుతుంది. ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ లో మ‌ల‌యాళం బ్యూటీల స‌క్సెస్ రేట్ కూడా బాగుంది. ఆ బ్యూటీ లు న‌టించిన సినిమాలు మంచి విజ‌యం సాధించ‌డంతో లక్కీ భామ‌లుగా వెలిగిపోతున్నారు.

కొన్నాళ్ల‌గా ముంబై భామ‌ల దిగుమ‌తి త‌గ్గ‌డానికి కార‌ణం మాలీవుడ్ బ్యూటీల హ‌వా అని చెప్పొచ్చు. ఈ బ్యూటీల్లో ఉన్న మ‌రో క్వాలిటీ ఏంటంటే? చ‌క్క‌ని మాట‌కారి త‌నం క‌లిగి ఉండ‌టం. తెలుగు భాష వ‌చ్చినా రాక‌పోయినా ప్ర‌య‌త్నించి ఆడియ‌న్స్ కి ద‌గ్గ‌ర‌వుతుంటారు. అంతే వేగంగా భాష‌ను నేర్చుకుంటారు. ద‌ర్శ‌క‌-నిర్మాత‌-హీరోల్ని తెలివిగా లాక్ చేయ‌గ‌ల‌రు.

`భీమ్లా నాయ‌క్` ప్రీ రిలీజ్ వేదిక‌పై సంయుక్త మీన‌న్ ప‌వ‌న్ కి పెద్ద ఫ్యాని అని...ప‌వ‌న్ వ్య‌క్తిత్వాన్ని ఉద్దేశించి చేసిన సూక్తులు నెట్టింట ఎంత‌గా వైర‌ల్ అయ్యాయో తెలిసిందే. ఆదే వేదిక‌పై త్రివిక్ర‌మ్ ని ప్ర‌శంసిస్తూ ఆకాశానికి ఎత్తేసింది. అలా తొలి సినిమాతోనే సంయుక్త స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అయింది. అంత‌కుముందు నివేధా థామ‌స్..కీర్తి సురేష్ లాంటి వాళ్లు సైతం తెలుగు హీరోల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు అంతే ఆస‌క్తిక‌రం.

అలా ముంబై భామ‌ల‌కి తెలియ‌ని కొన్ని టెక్నిక్ లు ఈ మాలీవుడ్ భామ‌ల‌ల్లో ఉన్నాయి. ఆ ర‌కంగా అవ‌కాశాలు అందుకోవ‌డంలో ముందుటున్నారు. తాజాగా స‌యుక్త మీన‌న్ పై వ‌స్తోన్న రూమ‌ర్ల‌ని ఎంతో స్వీట్ గా ఖండిచింది. ``మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమాలో నేను ఉన్నాను అన్న‌ది స్వీట్ రూమ‌ర్. ఇందులో వాస్త‌వం లేదు.

అలాగే ఆ మ‌ధ్య `సార్` సినిమా షూటింగ్ స‌మ‌యంలో ధ‌నుష్ తో గొడ‌వ ప‌డి సెట్స్ నుంచి వెళ్లిపోయాన‌ని రాసారు. ఇదీ అబ‌ద్దం. ఇలాంటి రూమ‌ర్లు ఎలా పుట్టిస్తారు? ఇలాంటివి రాయ‌డానికి క్రియేటివిటీ ఉండాలి. వాళ్ల‌కే ఇలాంటివి సాధ్యం. వాళ్ల సృ జ‌నాత్మ‌క‌త‌ని మెచ్చుకోవాల్సిందే`` అంటూ స్వీట్ గా సెటైర్ వేసింది.