Begin typing your search above and press return to search.

ఆ సినిమాతో ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పాల‌నుకున్నా: సంయుక్త

By:  Tupaki Desk   |   13 Feb 2023 3:27 PM GMT
ఆ సినిమాతో ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పాల‌నుకున్నా: సంయుక్త
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'భీమ్లానాయ‌క్‌' మూవీతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది మ‌ల‌యాళ సోయ‌గం సంయుక్త . ఇందులో రానాకు జోడీగా న‌టించి క‌థ‌కు కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర‌లో క‌నిపించిన సంయుక్త ఈ మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపుతో పాటు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంది. క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన 'బింబిసార‌'తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుని తెలుగు నేర్చేసుకుంది.

ప్ర‌స్తుతం తెలుగులో ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న 'సార్‌'తో పాటు సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా రూపొందుతున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ 'విరూపాక్ష‌'లోనూ న‌టిస్తోంది. ఇందులో ధ‌నుష్ హీరోగా న‌టించిన 'సార్' మూవీతో ఫిబ్ర‌వ‌రి 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఎడ్యుకేష‌న్ మాఫియా నేప‌థ్యంలో వెంకీ అట్లూరి ఈ మూవీని త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీని తెర‌కెక్కించాడు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ ల‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఫిబ్ర‌వ‌రి 17న 'సార్‌' రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో సోమ‌వారం మీడియాతో సంయుక్త మీన‌న్ ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. 'భీమ్లా నాయ‌క్‌' మూవీకి ముందే బింబిసార‌, సార్ లో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది సంయుక్త . ఈ రెండు సినిమాల షూటింగ్ ల‌లో వుండ‌గానే 'భీమ్లానాయ‌క్' టీమ్ నుంచి త‌న‌కు ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, మ‌ల‌యాళ మాతృక‌కు భిన్నంగా మార్పులు చేయ‌డంతో ఈ మూవీలో న‌టించ‌డానికి అంగీక‌రించాన‌ని తెలిపింది.

కేర‌ళ‌లోని ఓ ప‌ల్లెటూళ్లో పుట్టిన నేను సినిమాల్లోకి వ‌స్తాన‌ని, హీరోయిన్ గా రాణిస్తాన‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని తెలిపింది. తొలి సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు ఏదో వెకేష‌న్ కు వెళ్లిన‌ట్టుగా ఫీల‌య్యాన‌ని, ఓ మంచి సినిమాలో న‌టించి ఆ త‌రువాత సినిమాల‌కు గుడ్ బై చెప్పాల‌నుకున్నాన‌ని వెల్ల‌డించింది. అయితే తానొక‌టి త‌లిస్తే విధి మ‌రోటి త‌లిచింద‌ని, ఆ కార‌ణంగానే తాను హీరోయిన్ గా ఇక్క‌డ వున్నాన‌ని తెలిపింది. దాంతో ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పాల‌నుకున్న నేను ఆ త‌రువాత సినిమాతో ప్రేమ‌లో ప‌డిపోయానంది.

బింబిసార‌, విరూపాక్ష సినిమాల త‌రువాత వెంకీ అట్లూరిని క‌లిశాను. త‌ను సార్ క‌థ వినిపించాడు. త‌న క‌థ చెప్ప‌గానే ఇదొక గొప్ప సినిమా అవుతుంద‌ని గ్ర‌హించాను. దీన్ని ఎలాగైనా మిస్ చేసుకోకూడ‌ద‌ని గ‌ట్టిగా అనుకున్నాను. ఆ త‌రువాత నాకు లుక్ టెస్ట్ చేసి ఫైన‌ల్ చేశారని తెలిపింది. ఇక త‌న ఇంటి పేరు గురించి మాట్లాడుతూ ' నా ఇంటి పేరుని ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని అంద‌రినీ కోరుతున్నాను. న‌న్ను ఎవ‌రైనా కులం పేరుతో గుర్తిస్తే నేను అంగీక‌రించ‌ను. అది వేరు అని భావిస్తాను.

ప్ర‌గ‌తిశీలంగా వుండాల‌ని, నేను ప్ర‌త్యేక సెక్ష‌న్ కు చెందిన వ్య‌క్తిన‌ని న‌న్ను ప్రొజెక్ట్ చేయ‌డాన్ని నేను ఇష్ట‌ప‌డ‌ను. నేను స‌మంత‌లా వున్నాన‌ని కొంత మంది అంటున్నారు. అయితే స‌మంతలా నా యాక్టింగ్ వుందంటే సంతోషిస్తాను. అని తెలిపింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.