Begin typing your search above and press return to search.

చీరలో చందమామలా 'సార్' బ్యూటి

By:  Tupaki Desk   |   6 April 2023 8:51 PM GMT
చీరలో చందమామలా సార్ బ్యూటి
X
యుంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారనే చెప్పాలి. టాలీవుడ్ లో భీమ్లా నాయక్ చిత్రంతో ఈ అమ్మడు ఎంట్రీ ఇవ్వగా... ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. మొదటి సినిమాలో రానా సరసన నటించి మెప్పించింది ఈ భామ. ఇక గత ఏడాది బింబిసార చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ.... ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్ సినిమాలో నటించింది.

ఇక సార్ సినిమాలో సంయుక్త అందాలకు, నటనకు అందరూ ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ. ఇక ఈ భామ హీరోల పాలిట అదృష్ట దేవతగా మారిపోయిందని అంతా అనుకున్నారు. తను నటిస్తున్న అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయని.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇక ఈ బ్యూటీ... గులాబీ పువ్వులాంటి గ్లామర్‌కి తోడుగా శారీ కట్టుకున్న ఈ కేరళ ముద్దుగుమ్మ.. పదహారణాల తెలుగమ్మాయిలా పోజులిచ్చింది.

అమ్మడి లేటెస్ట్‌ ఫోటోలకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అవుతున్నారు. సంయుక్త మీనన్‌ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు గ్లామర్ క్వీన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లైక్‌లు, హార్ట్ సింబల్స్‌ షేర్ చేస్తున్నారు.

ఇక సంయుక్త మీనన్ నటిస్తున్న తాజా చిత్రం వీరూపాక్ష. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. విరూపాక్ష' సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన సుకుమార్ శిష్యుడు. ఈ చిత్రానికి సుకుమార్ కథ, కథనం అందించారు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలపై ఓ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఈ కేరళ కుట్టికి తిరుగు లేదని అంటున్నారు. వరుస విజయాలు తన ఖాతాలో వేసుకుంటుంది అని భావిస్తున్నారు. చూడాలి ఇక ఈ సినిమా హిట్ అయితే తనకు ఎంత కలిసి వస్తోందనని.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.