Begin typing your search above and press return to search.
ఢిల్లీలో డ్రస్సులపై సెక్సీ ఖాన్ కామెంట్
By: Tupaki Desk | 17 April 2017 6:03 PM GMTబాలీవుడ్ బ్యూటీ సనా ఖాన్ ఎప్పటికప్పుడు ట్రెండీగానే ఉంటుంది. కెరీర్ ను కూడా అందుకు తగినట్లుగా మార్చేసుకుంటూ ఉంటుంది. తెలుగులో కళ్యాణ్ రామ్ కత్తి.. గగనం.. మిస్టర్ నూకయ్య వంటి చిత్రాలలో నటించిన సనా.. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జైహో లో కూడా యాక్ట్ చేసింది. ఆ వెంటనే వజహ్ తుమ్ హో అంటూ అడల్ట్ మూవీ చేసి ఆశ్చర్యపరిచేసింది.
ఇప్పుడీ 28 ఏళ్ల ట్రెండీ బ్యూటీ.. ఢిల్లీలో డ్రెసింగ్ పై పెద్ద లెక్చర్ నే ఇచ్చేసింది. 'ఢిల్లీలో కనిపించినంతగా మంచి డ్రెసింగ్ తో ముంబై క్లబ్ లు.. కేఫ్ లలో కూడా జనాలు కనిపించరు. బయటకు వెళ్లేటపుడు అందంగా డ్రెసింగ్ చేసుకుని వెళ్లడంపై ఢిల్లీ ప్రజలకు ఎక్కువ అవగాహన.. ప్రాధాన్యత ఉన్నాయి. ముంబైలో ఇది కాసింత తక్కువే. ఢిల్లీలో బయటకు వెళ్లాలంటే మాత్రం.. కచ్చితంగా బాగా డ్రెస్ చేసుకోవాలి. లేకపోతే తక్కువ స్థాయిలో ఉన్న ఫీలింగ్ కలగడం అయితే ఖాయం. పార్టీల కోసం మాత్రమే కాదు.. రొటీన్ లైఫ్ విషయంలో కూడా ఇక్కడి జనాలు డ్రెసింగ్ కు ఇంపార్టెన్స్ ఇస్తారు' అని చెప్పింది సనాఖాన్.
ఫ్యాషన్ కేపిటల్ అయిన ముంబై కంటే.. దేశ రాజధాని ఢిల్లీలోనే ఫ్యాషన్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని సనాఖాన్ చెప్పడం ఆసక్తికరమైన విషయమే. ప్రస్తుతం ఈ భామ శింబుతో కలిసి కోలీవుడ్ మూవీ ఏఏఏ లో నటిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/