Begin typing your search above and press return to search.

ల‌వ్ లో కొరియోగ్రాఫ‌ర్ మోసం చేశాడంటూ..

By:  Tupaki Desk   |   12 Feb 2020 4:30 PM GMT
ల‌వ్ లో కొరియోగ్రాఫ‌ర్ మోసం చేశాడంటూ..
X
నాగార్జున న‌టించిన‌ `గ‌గ‌నం`లో ఒక ముఖ్య పాత్ర‌లో నటించింది బాలీవుడ్ క‌థానాయిక స‌నాఖాన్. ఆ త‌ర్వాత తెలుగులో మంచు మ‌నోజ్ స‌ర‌స‌న మిస్ట‌ర్ నూక‌య్య‌.. క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న `క‌త్తి` చిత్రాల్లో న‌టించింది. టాలీవుడ్ లో ఆశించినంత పెద్ద బ్రేక్ రాలేఉ. ఆ క్ర‌మంలోనే ఇక్క‌డ‌ స్టార్ కాలేక‌పోయింది. అటుపై బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా ప‌లు చిత్రాల్లో న‌టించింది.

గ‌త కొంత‌కాలంగా సినిమాల్లో అవ‌కాశాలు లేక‌పోయినా.. టీవీ రియాలిటీ షోల‌తో కాలం వెల్ల‌దీస్తోంది. ఆ క్ర‌మంలోనే కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో ప్రేమ‌లో ప‌డింది. గత ఏడాది మెల్విన్ పుట్టినరోజున సనా అధికారికంగా త‌న ప్రేమ వ్య‌వ‌హారాన్ని ధృవీక‌రించింది. మెల్విన్ తో ప్రేమ‌లో స‌ర్వ‌స్వం మ‌రిచాన‌ని.. త‌న‌తో ప్ర‌తిక్ష‌ణాన్ని ఎంజాయ్ చేస్తున్నాన‌ని స‌నా ఆనందం వ్య‌క్తం చేసింది. త‌న జీవితంలో మెల్విన్ రాకను అదృష్టంగా భావిస్తున్నాన‌ని .. త‌న‌ని ఎప్ప‌టికీ ఇలానే ప్రేమిస్తాన‌ని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. అయితే చాలా ప్రేమ‌ల్లానే స‌నా ప్రేమ కూడా ఇప్పుడు బ్రేకప్ అయిపోవ‌డం ప్ర‌ముఖం గా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ప్రియుడు మెల్విన్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని.. మోస‌గించాడ‌ని స‌నా త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయింద‌ట‌. ఆ క్ర‌మంలోనే మెల్విన్ తో ఉన్న త‌న ఫోటోల‌న్నిటినీ సోష‌ల్ మీడియాల నుంచి తొల‌గించింది. దీంతో మ‌రో బాలీవుడ్ జంట ప్రేమాయ‌ణానికి బ్రేక‌ప్ త్ప‌లేద‌ని ముంబై మీడియాలో ప్ర‌చార‌మ‌వుతోంది. ``నేను నిన్ను కలిసే వరకు ఒకరిని ఇంతగా ప్రేమిస్తానని ఎప్పటికీ తెలియదు. న‌న్ను నేను క‌నుగొన్నాను`` అంటూ క‌విత‌లు చెప్పిన స‌నాఖాన్ ఉన్న‌ట్టుండి ఇలా ప్రేమ‌కు బ్రేక‌ప్ చెప్పేస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌నేలేదు. ఇన్నాళ్ల ప్రేమ ఒక్క‌సారిగా బ్రేక‌ప్ అయి పోయింది.