Begin typing your search above and press return to search.
బాలీవుడ్ నటి బాయ్ ఫ్రెండ్ కక్కుర్తి పని!
By: Tupaki Desk | 30 Aug 2016 9:51 AM GMTఆయనేమో సెక్యూరిటీ కోసమే కెమెరాలు పెట్టానంటాడు... అపార్టుమెంట్ వాళ్లు మాత్రం అమ్మాయిల కోసమే అలా చేశాడని ఆరోపిస్తున్నారు! తన వ్యక్తిగత భద్రత కోసం ఇంట్లో కెమెరాలు పెట్టుకున్నాని ఆయన వాదిస్తుంటే... అమ్మాయిల్ని తీసుకొచ్చి, వారిని ట్రాప్ చేసేందుకే కెమెరాలను వాడుతున్నాడని వారు అంటున్నారు! ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు బాలీవుడ్ నటి సనాఖాన్ బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘జయహో’ చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సనాఖాన్. అయితే, ఈ జంటకు వివాదాలు కొత్త కాదని ముంబైలోని ఆ అపార్టుమెంట్ వాసులు ఆరోపిస్తున్నారు.
గతంలో ఒక మీడియా ప్రతినిధిని ఈ ఇద్దరూ బెదిరించారు. ఆ కేసులో సనాఖాన్ తోపాటు ఆమె ప్రియుడు కూడా జైలు పాలయ్యాడు. ఆ తరువాత, ఇద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకి వచ్చారు. అయితే, ఈ అపార్టుమెంట్ తాను సొంతం కొనుక్కున్నాననీ, దాన్లో సెక్యూరిటీ కోసం కెమెరాలు పెట్టానని ఇస్మాయిల్ అంటున్నాడు. తానంటే ఈ అపార్టుమెంట్ వారికి మొదట్నుంచీ ఎందుకో పడటం లేదని చెబుతున్నారు. 2011లో తన కారుపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పాడు చేశారన్నాడు. ఈ మధ్యనే అపార్ట్ మెంటు వార్షికోత్సవం సందర్భంగా ఇంట్లోని కెమెరాలు తొలగించాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు నోటీసులు ఇచ్చారన్నాడు.
ఆగస్టు 2న తనకు నోటీసులు ఇచ్చారనీ, వినకపోవడంతో మరోసారి 11వ తేదీన కూడా నోటీసులు పంపారని ఇస్మాయిల్ చెబుతున్నాడు. ఆ నోటీసులకు కూడా తాను స్పందించకపోవడంతో ఇప్పుడు ఏకంగా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నాడు. ఆగస్టు 25న ఇస్మాయిల్ పై ఒషివారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసి, మహిళలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాడని ఈ ఫిర్యాదులో అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈకేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు పెట్టుకోవాలంటే పోలీసులు అనుమతి అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ, ఎవరి అనుమతీ లేకుండా.. కేవలం వ్యక్తిగత భద్రత కోసమే ఇస్మాయిల్ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేసినట్టు అనేది అసలు ప్రశ్న?