Begin typing your search above and press return to search.
మండుతున్న సమాధిలో నన్ను నేను చూశాను!
By: Tupaki Desk | 26 July 2022 4:08 AM GMTకింగ్ నాగార్జున `గగనం` చిత్రంలో నటించిన సనాఖాన్ తెలుగు పరిశ్రమలో ఆశించినంతగా ఎదగలేకపోయింది. తమిళంలోనూ ఆశించిన కెరీర్ దక్కలేదు. ఆ తర్వాత హిందీలో సల్మాన్ ఖాన్ సరసనా అవకాశం అందుకున్నా కానీ రకరకాల కారణాలతో తనకు కెరీర్ పరంగా ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది. ఇటీవల బిగ్ బాస్ హిందీ రియాలిటీ షోలోనూ సందడి చేసినా అదీ ఉపయోగపడలేదు. అదే క్రమంలో కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో సనాఖాన్ ప్రేమాయణం బ్రేకప్ తనను నిరాశకు కారణమైంది. కారణాలు ఏవైనా కానీ ఇవన్నీ తనని తీవ్రమైన డిప్రెషన్ లోకి తీసుకెళ్లాయని సనా మీడియాతో చాటింగ్ లో ఇంతకుముందు వెల్లడించింది.
ప్రస్తుతం సనాఖాన్ వివాహం చేసుకుని జీవితంలో సెటిలైంది. అంతకంటే ముందే హిజాబ్ ధరించి అల్లాను ప్రార్థించడం ప్రారంభించింది. ఇప్పుడు తాను అల్లాకు అంకితం. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ.. బిగ్ బాస్ ఫేమ్ సనా ఖాన్ షోబిజ్ నుండి వైదొలిగి ఇస్లాంను హృదయపూర్వకంగా ఎందుకు ఎంచుకుందో వెల్లడించింది.
సనా తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న ఒక వీడియోలో తాను హిజాబ్ ధరించడం ప్రారంభించిన తర్వాత .. అల్లాహ్ మార్గాలను అనుసరించడానికి ముందు తర్వాత తన జీవితాన్ని పోల్చింది. వీడియోలో ఆమె చేతులకు గోరింట.. తలకు నల్లటి బురఖా ధరించి కనిపించింది. అంతకుముందు తన జీవితంలో పేరు కీర్తి డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు మనశ్శాంతితో లేదు. నాకు అన్నీ ఉన్నా కానీ ఎందుకు సంతోషంగా లేను? అని ప్రశ్నించుకున్నాను. ఇది చాలా కఠినమైన దశ. నిరాశకు గురైన రోజులు అవి.. అల్లా సందేశాన్ని.. నేను అతని సంకేతాల ద్వారా చూడగలిగాను`` అని ఆమె చెప్పింది.
తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన 2019 గురించి గుర్తు చేసుకుంది. ``2019లో రంజాన్ సందర్భంగా నేను నా కలలో ఒక సమాధిని చూసాను. నేను మండుతున్న సమాధిని చూసాను. సమాధిలో నన్ను నేను చూసుకోగలిగాను. నేను ఖాళీ సమాధిని చూడలేదు. అక్కడ నన్ను నేను చూశాను. నేను మారకపోతే నా అంతం ఇదే అని దేవుడు నాకు ఇస్తున్న సంకేతం అని భావించాను. అది నన్ను కాస్త ఆందోళనకు గురిచేసింది`` అంటూ వీడియోలో భావోద్వేగానికి లోనైంది. నేను నాలో మార్పులను ఇప్పటికీ గుర్తుంచుకుంటాను. నేను స్ఫూర్తినిచ్చే ఇస్లామిక్ ప్రసంగాలను వింటాను. ఒక రాత్రి నేను చాలా అందమైన విషయాన్ని చదివినట్లు గుర్తుంది. మీ చివరి రోజు మీ మొదటి రోజు కావడం మీకు ఇష్టం లేదు! అని ఆ సందేశంలో ఉంది. హిజాబ్ ధరించడం... అది నన్ను చాలా లోతుగా తాకిన విషయం`` అని కూడా వెల్లడించింది.
అల్లా పరివర్తన మరుసటి రోజు ఉదయం నేను నిద్రలేచాను. ఆ రోజు నా పుట్టినరోజు. నేను ఇంతకు ముందు చాలా స్కార్ఫ్ లు కొన్నాను. కానీ టోపీని లోన దాచుకున్నాను. కండువా ధరించాను.. కానీ ఇప్పుడు వేరు! నేను దీన్ని(హిజాబ్) ఇంకెప్పుడూ తొలగించను. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. నేను మారిపోయాను. నేను వెనక్కి వెళ్లి నా అబయా (హిజాబ్)ని తీసివేసి విసిరేయను`` అని ఆమె తన కన్నీళ్లతో చెప్పింది.
సనా 2020లో ముఫ్తీ అనస్ సయ్యద్ ను వివాహం చేసుకుంది. ఇద్దరూ కలిసి ఇటీవల హజ్ యాత్రకు బయలుదేరారు. సనా ఖాన్ తన సోషల్ మీడియాలో ప్రేరణాత్మక కోట్ లను షేర్ చేయడం ఇటీవల తరచుగా కనిపిస్తోంది. కెరీర్ మ్యాటర్ ని పరిశీలిస్తే.. సల్మాన్ `జై హో`.. వజా తుమ్ హో.. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ వంటి చిత్రాలలో సనా ఖాన్ నటించింది. గోల్ లోని `బిల్లో రాణి` సహా కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన డ్యాన్స్ నంబర్ లలో నర్తించింది.