Begin typing your search above and press return to search.

కాబోయే వాడి మోసం పై న‌టి పోలీసుల‌కు ఫిర్యాదు

By:  Tupaki Desk   |   3 Feb 2020 9:53 PM IST
కాబోయే వాడి మోసం పై న‌టి పోలీసుల‌కు ఫిర్యాదు
X
త‌న‌ను పెళ్లాడ‌తాన‌ని మాటిచ్చాడు. అటుపై నిశ్చితార్థం అయ్యింది. ఆ క్ర‌మంలోనే జంట షికార్లు చేశారు. అత‌డి కెరీర్ డైల‌మాలో ఉన్న‌ప్పుడు త‌న‌కోసం ఆర్థికంగా ఎంతో సాయం చేసింది. మోడ‌ల్ గా ఉన్న త‌న‌ను ఒకానొక స‌మ‌యంలో ఆదుకుంది. అయితే అవేవీ ప‌ట్టించుకోకుండా అత‌డు నిశ్చితార్థం అయ్యాకా పెళ్లి అన‌గానే మాట మార్చాడ‌ట‌. దీంతో ల‌బోదిబోమంటూ స‌ద‌రు యువ‌న‌టి పోలీసుల్ని ఆశ్ర‌యించింది. ఇంత‌కీ ఎవ‌రా న‌టి అంటే.. ?

పేరు స‌న‌మ్ శెట్టి. శ్రీ‌రామ‌రాజ్యం నిర్మాత వార‌సుడిని ప‌రిచ‌యం చేస్తూ .. కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఇంటింటా అన్నమయ్య చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. అయితే దుర‌దృష్ట వ‌శాత్తూ ఆ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాలేదు. `శ్రీమంతుడు` చిత్రంలో మహేష్ సరసన అతిథి పాత్రలో నటించింది. ఇక అటుపై కెరీర్ ప‌రంగా రాణించే ఏ ఒక్క అవ‌కాశం రాలేదు ఈ అమ్మ‌డికి. ఆ క్ర‌మంలోనే మోడ‌ల్ తో ప్రేమ‌లో ప‌డింది. అత‌డి ఎదుగుద‌ల కోసం ఆరాట‌ప‌డింది.

కానీ అది కూడా ఇప్పుడు ఫెయిలైంది. అత‌డు పెళ్లాడ‌తాన‌ని మోసం చేశాడు. ఇప్పుడు మాట మార్చాడు. బిగ్ బాస్ సీజ‌న్ అయిపోగానే పెళ్లాడ‌తాన‌ని మాటిచ్చి ఇప్పుడు మొహం చాటేస్తున్నాడ‌ని.. బిగ్ బాస్ తో వ‌చ్చిన గుర్తింపు వ‌ల్ల‌ త‌న‌ని పెళ్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని స‌ద‌రు న‌టి కాబోయేవాడి పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. అత‌డిని క‌ష్టంలో ఆదుకునేందుకు 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేశాన‌ని స‌న‌మ్ శెట్టి ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఆశ‌లు రేపి మోసం చేశాడ‌ని.. బిగ్ బాస్ సీజ‌న్ 3 ముగిసే వార‌కూ వేచి చూడాల‌ని అన్నాడ‌ని స‌న‌మ్ వెల్ల‌డించింది. ఇంత‌కీ ఆయ‌న గారి పేరేమి అంటే త‌ర‌ణ్ అని తెలుస్తోంది. ఇంత‌కీ ఈ గొడ‌వ‌ను పోలీసులే ప‌రిష్క‌రిస్తారేమో చూడాలి.