Begin typing your search above and press return to search.

సీక్రెట్ గా తుంగ‌భద్ర హీరోయిన్ పెళ్లి

By:  Tupaki Desk   |   10 Jan 2020 5:02 AM GMT
సీక్రెట్ గా తుంగ‌భద్ర హీరోయిన్ పెళ్లి
X
నిర్మాత నుంచి డ‌బ్బు వ‌సూలు చేసి ప‌రారైన కేసులో తుంగ‌భ్ర‌ద హీరోయిన్ విజ‌య‌ల‌క్ష్మి కోసం పోలీసులు వెతుకుతున్న సంగ‌తి తెలిసిందే. మోసం చేసి సొమ్ముల‌తో ఉండాయించిద‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. పోలీసులు కేసు న‌మోదు చేసి విజ‌య‌ల‌క్ష్మి కోసం గాలించారు. తాజాగా ఆ మిస్ట‌రీ వీడింది. విజ‌య‌ల‌క్ష్మి క‌ర్ణాట‌క‌ రాయ‌చూర్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. భ‌ర్త అంజ‌నేయ స‌హా పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. తాజాగా ఈ వివాదంపై మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి విజ‌య‌ల‌క్ష్మి నేరుగ వివాదంపై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

తుంగ‌భ‌ద్ర సినిమా షూటింగ్ చేస్తున్న‌ప్పుడు ఆ సినిమా స‌హాయ ద‌ర్శ‌కుడు అజినేయను ప్రేమించాన‌ని... అత‌ను గంగావ‌తిలో పెళ్లి చేసుకున్నాడ‌ని తెలిపింది. దీంతో ఇంట్లో త‌న అవ్వ‌..త‌ల్లికి న‌చ్చ‌క పోవ‌డంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసార‌ని ప్ర‌చారమైంది. ఇదంతా డ‌బ్బుల కోసం ఆడుతున్న‌ పెద్ద డ్రామా అని విజ‌య‌ల‌క్ష్మి ఆరోపించింది. త‌న త‌ల్లిదండ్రులు విడిపోయి చాలా కాల‌మ‌వుతోంద‌ని...త‌న‌ త‌ల్లి స‌హా పెంచిన తండ్రి బాధ‌లు పెడుతున్నార‌ని వాపోయింది. త‌ను భ‌ర్త‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించింది. ఇంటి నుంచి గానీ..ఏ నిర్మాత నుంచి గానీ డ‌బ్బు తీసుకోలేద‌ని తెలిపింది.

ఇంట్లో పెద్దాళ్ల‌కు డ‌బ్బు సంపాదించడ‌మే ముఖ్యం. తాను పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకునే వారు కాద‌ని ఆవేద‌న చెందింది. జిల్లా ఎస్పీ ని త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సింది గా కోరింది. దీంతో హీరోయిన్ మిస్ట‌రీ ఓ కొలిక్కి వ‌చ్చింది. విజ‌య‌ ల‌క్ష్మి వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో కేసు కొత్త కోణంలో ద‌ర్యాప్తు చేయాల‌ని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ర‌హాస్యంగా విజ‌య‌లక్ష్మి పెళ్లి చేసుకున్న‌ట్లు ఈ ఘ‌ట‌న‌తో వెలుగు లో వ‌చ్చింది.