Begin typing your search above and press return to search.

#గ‌ర్లానీ.. డాక్ట‌ర్ తో 15 ఏళ్ల ప్రేమ‌ బంధానికి సాక్ష్యం

By:  Tupaki Desk   |   7 July 2021 8:00 AM IST
#గ‌ర్లానీ.. డాక్ట‌ర్ తో 15 ఏళ్ల ప్రేమ‌ బంధానికి సాక్ష్యం
X
ఏడాది కాలంగా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో సంజ‌న గ‌ర్లానీ పేరు హెడ్ లైన్స్ లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా శాండ‌ల్వుడ్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌వ్వ‌డంతో త‌న పేరు ఇంటా బ‌య‌టా మీడియాలో మార్మోగింది. అయితే అది గ‌తం. వ‌ర్త‌మానంలో సంజ‌న తిరిగి కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. సాధార‌ణ జీవితానికి అల‌వాటు ప‌డ్డారు. త‌న ముఖంలో గిల్ట్ అనేదే క‌నిపించ‌డం లేదు.

ఇటీవ‌లే అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం రోజున స్పెష‌ల్ యోగాస‌నాల‌తో సంజ‌న ట్రీటిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన చాలా విష‌యాల‌ను సంజ‌న ప్ర‌తిదీ ఓపెన‌వుతున్నారు. దాదాపు 15 ఏళ్లుగా త‌న‌కు బెంగ‌ళూరు డాక్ట‌ర్ అజీజ్ తో సంబంధం ఉంద‌ని అత‌డు గొప్ప ప్రేమికుడ‌ని సంజ‌న తెలిపారు. ప‌దిహేనేళ్ల క్రిత‌మే త‌మ మ‌ద్య ప్రేమ పుట్టింది. కానీ ఆ ర‌హస్యంపై ఏనాడూ ఓపెన్ కాలేద‌ని త‌న మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. త‌న‌కు అన్న వ‌రుస అయ్యే వారితోనూ లింకులు పెట్టి గాసిప్పులు రావ‌డం త‌న‌ని బాధించింద‌ని సంజ‌న వాపోయారు.

డాక్ట‌ర్ అజీజ్ పేరు త‌న మెడ‌కు దిగువ‌న‌ వెన‌క‌వైపుగా టాట్టూను వేయించుకున్న వైనం బ‌య‌ట‌ప‌డింది. ఏ అనే అక్ష‌రంతో మొద‌లై రోమ‌న్ లెట‌ర్స్ లో ఈ టాట్టూ కాస్త పెద్ద‌గానే క‌నిపిస్తోంది. ఇక అజీజ్ ని పెళ్లాడాక తాను ఇస్లామ్ లో చేరార‌ట‌. నిజ‌మైన ప్రేమ క‌ష్టం సుఖం అన్నిటా ఆదుకుంటుంది. అది త‌న‌కు అజీజ్ రూపంలో ద‌క్కింద‌ని సంజ‌న ఆనందం వ్య‌క్తం చేశారు. ఇక లైఫ్ లో చాలా డైల‌మాల నుంచి బ‌య‌ట‌ప‌డి తిరిగి య‌థావిధిగా సినీకెరీర్ ని సాగించాల‌ని సంజ‌న ఆశ‌ప‌డుతోంది. మ‌రి మునుముందు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌కు ఆఫ‌ర్లు ఇస్తారేమో చూడాలి.