Begin typing your search above and press return to search.
టాలీవుడ్ వద్దంది..కోలీవుడ్ నెత్తిన పెట్టుకుంది
By: Tupaki Desk | 4 April 2017 5:30 PM GMTహీరో కావడానికంటే ముందు నటుడిగా మంచి పేరు సంపాదించాడు సందీప్ కిషన్. స్నేహగీతం.. ప్రస్థానం సినిమాలు అతడిలోని నటుడిని బయటికి తీశాయి. తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో హీరోగానూ నిలదొక్కుకున్నాడు. ఆ సినిమా తర్వాత కుర్రాడు మంచి స్థాయికి వెళ్లేలా కనిపించాడు. అతడికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. కానీ ఏం లాభం. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయాడు. బీరువా.. టైగర్ లాంటి సినిమాలు పర్వాలేదనిపించినా.. కెరీర్ ఏమీ ఊపందుకోలేదు. గత ఏడాది రన్.. ఒక్క అమ్మాయి తప్ప అతడిని ముంచేశాయి. తాజాగా ‘నగరం’ సినిమాకు టాక్ బాగున్నా సినిమా నిలబడలేదు. సందీప్ ఖాతాలో మరో ఫ్లాప్ జమ అయిపోయింది.
విశేషం ఏంటంటే.. ‘నగరం’ తమిళ వెర్షన్ ‘మానగరం’ మాత్రం అక్కడ మంచి విజయం సాధించింది. సందీప్ కు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. శంకర్ సహా ఎందరో ప్రముఖులు ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. సందీప్ నూ ప్రశంసించారు. దీంతో తమిళంలో ఇంకో రెండు సినిమాలు లైన్లో పెట్టిన సందీప్.. ఇక అక్కడే సెటిలైపోయేలా కనిపిస్తున్నాడు. సి.వి.కుమార్ దర్శకత్వలో అతను కథానాయకుడిగా నటించిన ‘మాయవన్’ మీద తమిళంలో మంచి బజ్ ఉంది. దీంతో పాటు ‘నా పేరు శివ’ ఫేమ్ సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు సందీప్. తాజాగా విశాల్ తో సమర్.. నాన్ సిగప్పు మనిదన్ (ఇంద్రుడు) లాంటి సినిమాలు చేసిన మాస్ డైరెక్టర్ తిరు.. సందీప్ హీరోగా ఓ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఇది కూడా తమిళ.. తెలుగు భాషల్లో తెరకెక్కుతుందట. తెలుగు మాటేమో కానీ.. తమిళంలో మాత్రం సందీప్ కు అవకాశాలు బాగున్నాయి. అతడి సినిమాలకు మంచి క్రేజ్ కూడా వస్తోంది. దీంతో ఇక అతను అరవ సినిమాలకే అంకితమైపోతే ఆశ్చర్యమేమీ లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/