Begin typing your search above and press return to search.
#గల్లీ రౌడీ.. కామెడీ వర్కవుటైతే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లా..!
By: Tupaki Desk | 4 April 2021 4:30 PM GMTటాలీవుడ్ లో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోగా సందీప్ కిషన్ పేరు మార్మోగుతోంది. ఇటీవల ఈ హీరోకి వచ్చినన్ని ఫ్లాపులు ఇంకే హీరోకి లేవు. ఇటీవలే అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏ1 ఎక్స్ ప్రెస్ కూడా నిరాశపరిచింది. అయితే సందీప్ ని ఈ సన్నివేశం నుంచి బయటపడేసేలా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ దక్కేదెలా?
ఇంతకుముందు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి కామెడీ ఎంటర్ టైనర్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా పుణ్యమే ఇప్పటికీ అతడు వరుస సినిమాలు చేయగలుగుతున్నాడు. ప్రతిభావంతుడే అయినా కొన్నిసార్లు కాలం కూడా కలిసి రావాలని అంటారు. ఇప్పుడు అలా కలిసొచ్చే సినిమాలోనే నటిస్తున్నాడా? అతడు నటిస్తున్న గల్లీ రౌడీ ఈ కేటగిరీయేనా? అంటే ఆన్సర్ కావాలంటే మే 21న విడుదల వరకూ ఆగాలి. ఈ మూవీ కూడా కామెడీ ఎంటర్ టైనర్ జోనర్ లోనే వస్తోంది. సందీప్ లుక్ బావుంది. దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి ఈసారి గ్రిప్పింగ్ కామెడీతో మైమరిపించగలిగితే సందీప్ కి ఒక హిట్టొస్తుందనే భావిద్దాం.
బాబి సింహా.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లాంటి ట్యాలెంట్ ఈ సినిమాకి అదనపు బలం. థియేటర్లలో కడుపుబ్బా నవ్వించగలిగితే కామెడీ పండితే జనం ఎప్పుడూ ఆదరిస్తారని ఇటీవలి జాతి రత్నాలు నిరూపించింది. మళ్లీ ఆ రేంజు అనే టాక్ తో సందీప్ హిట్టు కొట్టాలనే ఆశిద్దాం.
సందీప్ తోనే తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్ తెరకెక్కించిన డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి ఈసారి హిట్టిస్తాడనే అభిమానులు ఆశిస్తున్నారు. గతంలో అతడి విజయవంతమైన చిత్రాల తరహాలో ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి వర్కవుటవుతుందనే భావిద్దాం. సాయి కార్తీక్- చౌరాస్త రామ్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎంవివి సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు.